చదువు కాదు.. దయాగుణం నేర్పిస్తారు!

0
2


చదువు కాదు.. దయాగుణం నేర్పిస్తారు!

పేదలకు దాన, ధర్మాలు చేయడం, సాయంకోసం చూసే వారికి చేయూతనందించడం, ఇతరులతో ప్రేమగా మాట్లాడి వారి బాధను తగ్గించడం లాంటివన్నీ దయాగుణానికి ఉదాహరణలు. అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే, ఇటీవల కాలంలో కరుణ, దయ చూపించేవారు తగ్గిపోతున్నారు. అందుకే మనషుల్లో దయాగుణాన్ని బయటకు తీసుకురావడానికి లాస్‌ఏంజిల్స్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నడుం బిగించింది. దయా గుణం గురించి బోధించేందుకు ఏకంగా ‘కైండ్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌’ను స్థాపించింది. 

దయతో సాయం పొందిన వారితో పాటు దయతో సాయం చేసిన వారి జీవితాలు సంతోషంగా ఉంటాయని పలు పరిశోధనలు, సర్వేల్లో వెల్లడైందట. అందుకే మనషుల్లో దయా గుణం పెంపొందించడానికి ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించినట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కోర్సుల్లో ఎలాంటి అంశాలను పాఠ్యాంశాలుగా పెట్టాలి.. ఎలాంటి విషయాలను బోధించాలి? అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. పౌరులు మానవత్వంతో తమ వంతు కృషితో చక్కటి సమాజాన్ని నిర్మించేలా చేయడమే ఈ ఇన్‌స్టిట్యూట్‌ లక్ష్యమని అక్కడి అధ్యాపకులు చెబుతున్నారు. ‘‘ప్రస్తుత ప్రపంచం రాజకీయాలు, కలహాలు, హింసతో విషపూరితమైపోయింది. వీటికి మా కైండ్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ విరుగుడులా పనిచేస్తుంది’’అని యూనిర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా డీన్‌ డార్నెల్‌ హంట్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విశ్వవిద్యాలయం ఎంత మందికి దయా గుణం నేర్పిస్తుందో చూడాలి. 

– ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

  • kindness
  • help
  • universitySource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here