చదువు రాకపోతేనేం.. ఇంగ్లీషులో దంచికొట్టాడు, ఆ కూలీ స్పీచ్ వైరల్!

0
5


ఇంగ్లీష్ మాట్లాడటం అంటే మాటలు కాదు. బాగా చదువుకున్న వ్యక్తులు కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడాలంటే తడబడతారు. అయితే, కర్నాటకకు చెందిన ఈ శ్రామికుడు మాత్రం తడబడకుండా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు. తనకు అక్షరం ముక్క రాదంటూనే తన ఇంగ్లీషుతో ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఉర్కెరీలోని అనెనెల్లికి చెందిన రాజన్నను ఇటీవల కొంతమంది యువకులు పలకరించారు. ఈ సందర్భంగా అతను ఇంగ్లీషులో మాట్లాడి ఆశ్చరపరిచాడు. ‘‘మీ సాయానికి చాలా థాంక్స్’’ అంటూ గుక్క తిప్పుకోకుండా ఇంగ్లీషులో దడదడలాడించాడు. ‘‘నా పేరు రాజన్న. నేను ఫోన్ వాడను. నేను అందరిలా చదువుకోలేదు. జనాల నుంచి నేర్చుకున్నా. ప్రకృతే నా గురువు. ప్రపంచమే నా యూనివర్శిటి. నేను ఎవ్వరినీ ఫాలో కాను. ఎందుకంటే నాకు మోడ్రన్ మెథడ్స్ మీద నమ్మకం లేదు’’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏ చదువు చదవని రాజన్న ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో చూడండి అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి!!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here