చరణ్ గురించి చిరు.. బెంగుళూరులో కూడా పవన్ క్రేజ్ పీక్స్

0
1


సైరా రిలీజ్‌కి ఎంతో టైమ్ లేదు. చూస్తుండగానే రిలీజ్ డేట్ రోజుల్లో నుండి గంటల్లోకి వచ్చేసింది. దీంతో సైరా టీమ్ కూడా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ముందు నుండి కాస్త డల్‌గా ఉన్న టీమ్ ఇప్పుడు మాత్రం సైరా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. హిందీలో అమితాబ్, మలయాళంలో పృథ్విరాజ్, కన్నడలో శివరాజ్ కుమార్ ఈ సినిమా ప్రమోషన్స్‌కి అటెండ్ అయ్యారు. అయితే ఇప్పటివరకు చరణ్ గురించి పెద్దగా ఓపెన్ అవ్వని చిరంజీవి కన్నడ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాత్రం తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. వెళ్లిన ప్రతి చోట ఇలాంటి సినిమా తీసినందుకు చరణ్‌ని అంతా పొగుడుతుంటే చూసి మురిసిపోయిన చిరంజీవి బెంగుళూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన మనసులోని మాటలను బయటపెట్టారు.

Also Read: పవన్ కళ్యాణ్‌కి అమితాబ్ ప్రశంసలు..ఒక సెటైర్ కూడా

‘చిరంజీవి నువ్వు ఏం సాధించావు అంటే ముందు నా అభిమానులు అని చెబుతాను.కానీ నేను వేరు నా అభిమానులు వేరు కాదు కాబట్టి నువ్వు ఏం సాధించావు అంటే రామ్ చరణ్‌ని సాధించాను అని చెబుతాను” అని అన్నారు. ఆ టైమ్‌లో ముందు చిరంజీవి ముఖంలో, ఆ‌మాట చెబుతున్నప్పుడు రామ్ చరణ్ ముఖంలో కూడా ఒక రకమయిన భావోద్వేగం కనిపించాయి. ఇద్దరూ కూడా పెల్లుబికి వస్తున్న ఆనందభాష్పాలను కంట్రోల్ చేసుకున్నారు.

Also Read: Pawan Kalyan ‘సైరా’ కథ ఇమ్మన్నారు.. రామ్ చరణ్‌కి కూడా నో చెప్పాం

అయితే అంతకుముందు చరణ్ గురించి చాలా చెప్పుకొచ్చారు చిరంజీవి. మగధీర సినిమా వచ్చినప్పుడు అది చూసి,ఆ పాత్ర చూసి తనకు ఇప్పటివరకు అలాంటి సినిమా రాలేదు అని చెప్పాను అని అది తాను మర్చిపోయినా చరణ్ మర్చి పోకుండా ఇప్పుడు తనకు చరిత్రలో నిలిచిపోయే సైరా నరసింహారెడ్డి అనే సినిమా ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు.’ఎవరయినా కొడుకును ప్రోమోట్ చెయ్యాలనుకుంటారు, కానీ ఇక్కడ నా బిడ్డ నా కోరిక తీరుస్తూ నన్ను మరొక లెవెల్‌లో ఉంచేలాగా, ఒక అద్భుతమయిన క్యారెక్టర్ నా సినీ జీవితంలో మిగిలిపోయేలాగా చేసిన రామ్ చరణ్ ‌ని నేను మనస్ఫూర్తిగా, ఈ సభాముఖంగా…” అంటూ ముద్దాడారు. ‘హి ఈజ్ మై ప్రౌడ్ సన్’ అంటూ పొగిడేశారు.ఇది ఆ ఈవెంట్ మొత్తానికి హై లైట్ ఇన్సిడెంట్‌గా నిలిచింది.

Also Read: షాకింగ్: సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి కాదా?..సమ్మర్ రిలీజ్?

ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన శివన్న కూడా మెగాఫ్యామిలీ గురించి ఒక రేంజ్‌లో పొగిడారు. అయితే ఆ స్పీచ్ మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. శివరాజ్ కుమార్ ”రామ్ చరణ్ అందంగా ఉంటాడు,ఆ ఫ్యామిలీ మొత్తం అందంగా ఉంటారు, పవన్ కళ్యాణ్ అందంగా ఉంటారు” అన్నారు. పవన్ కళ్యాణ్ అనే మాట వినబడగానే ఈలలు, గోల. తరువాత శివరాజ్ కుమార్ మాట్లాడడానికి కామ్‌గా ఉండమని అక్కడి వాళ్ళను రిక్వెస్ట్ చెయ్యాల్సి వచ్చింది. మళ్ళీ తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఆయన చెప్పగానే మళ్ళీ అంతా విజిల్స్. ఈ ఇన్సిడెంట్‌తో పవన్ క్రేజ్ కేవలం తెలుగు వరకే పరిమితం కాదు అని మరొకసారి ప్రూవ్ అయ్యింది. ఓవరాల్‌గా కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మాత్రం సైరాకి ఫుల్ మైలేజ్ వచ్చింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here