చరిత్రకారులకు సముచిత స్థానం

0
3


చరిత్రకారులకు సముచిత స్థానం

నివాళులర్పిస్తున్న జడ్పీ ఛైర్మన్‌ దాదన్న గారి విఠల్‌రావు

ఖలీల్‌వాడి, న్యూస్‌టుడే: ప్రభుత్వం తెలంగాణ చరిత్రకారులందరికి సముచిత స్థానం కల్పిస్తోందని జడ్పీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. వినాయక్‌నగర్‌లోని వంద అడుగుల రోడ్డులో ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు జీవులంతా బానిస బతుకులు బతుకుతున్న ఆ రోజుల్లో రజాకర్లను ఎదిరించిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆమె పోరాటం స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షుడు మాసనగణేష్‌, కోశాధికారి శంకర్‌, మల్లయ్య, నగర అధ్యక్షుడు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

ఖలీల్‌వాడి: చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రజక ఐక్య వేదిక జిల్లా కన్వీనర్‌ దమ్మయ్య స్వామి అన్నారు. వేదిక ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. వంద అడుగుల రోడ్డులో ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమేష్‌, రాజేశ్వర్‌, రమేష్‌, దేవయ్య, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

బీఎస్పీ ఆధ్వర్యంలో..

ఖలీల్‌వాడి: బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మహతి రమేష్‌, ప్రధాన కార్యదర్శి గంగాధర్‌, కోశాధికారి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here