చాకలి ఐలమ్మ వర్ధంతి

0
5


చాకలి ఐలమ్మ వర్ధంతి

ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న రజక సంఘం ప్రతినిధులు

కామారెడ్డి గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో మంగళవారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు స్వామి ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆమె పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయపరంగా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. సంఘం ప్రతినిధులు నరేష్‌, పోచయ్య, శ్రీశైలం, రమేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here