‘చాణక్య’ టీజర్: ఇంట్రెస్టింగ్.. కానీ!

0
6


టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న స్పై-థ్రిల్లర్ మూవీ ‘చాణక్య’. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. గోపీచంద్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్ర పోషించింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.

గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సోమవారం సాయంత్రం 5.04 గంటలకు టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. గోపీచంద్ రా ఏజెంట్‌గా కనిపించబోతున్నారు. ఇండో-పాక్ బోర్డర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. అక్కడక్కడా కొన్ని హిందీ డైలాగులు కూడా పెట్టారు. మొత్తంగా టీజర్ బాగున్నా కొన్ని షాట్స్ గోపీచంద్ గత చిత్రం ‘సాహసం’ను గుర్తుచేస్తున్నాయి.

Also Read: ‘వాల్మీకి’ ట్రైలర్.. గద్దల కొండ గణేష్ గత్తర్లేపినాడు పో!!

ఇండో-పాక్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ను అత్యధిక శాతం జైపూర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జరిపారు. విజువల్స్ చాలా బాగున్నాయి. అలాగే, ఈ సినిమాకు మెహ్రీన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ‘తేరా గాఢ్ మే దమ్ హై తో వహి రుఖ్ సాలే.. మే ఆరావ్’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో టీజర్‌ను ముగించారు. మొత్తంగా ఒక యాక్షన్ ప్యాక్ట్ థ్రిల్లర్‌తో గోపీచంద్ ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.

ఇప్పటికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ స్పై-థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను ఈ ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు మాటలు అబ్బూరి రవి అందిస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రాఫర్. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తిరు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here