చారిత్రాత్మక అడుగు: 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్

0
2


హైదరాబాద్: ఇదొక చారిత్రాత్మక అడుగు. బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 క్రికెట్‌ను చేర్చేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్‌లు అంగీకరించాయి. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి.

భారత క్రికెటర్ల సందడి: బోట్‌పై నుంచి అమాంతం నీళ్లలోకి దూకిన ధావన్ (వీడియో)

ఈ మేరకు ఐసీసీ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ గేమ్స్‌లో భాగంగా జరగనున్న అన్ని మ్యాచ్‌లకు ఎడ్జిబాస్టన్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. 1998 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత మళ్లీ క్రికెట్‌ను చేర్చడం ఇదే మొదటిసారి. కౌలాలంపూర్‌ ఆతిథ్యమిచ్చిన ఈ గేమ్స్‌లో పురుషుల 50 ఓవర్ల పోటీలో దక్షిణాఫ్రికా స్వర్ణం నెగ్గింది.

కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 క్రికెట్‌ను చేర్చడంపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్నే మాట్లాడుతూ “మహిళల క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్ సమాజానికి ఇది నిజంగా చారిత్రాత్మక క్షణం, ఈ బిడ్‌కు అందరూ ఐక్యంగా మద్దతు తెలిపారు. మహిళల క్రికెట్ మరింతగా ఎదుగుతోంది. బర్మింగ్‌హామ్‌లో మహిళల టి20 క్రికెట్‌ను చేర్చడానికి కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్లు ఓటు వేసినందుకు సంతోషిస్తున్నాం” అని అన్నాడు.

ప్రపంచకప్ ఫైనల్: ఓవర్‌త్రోలో స్టోక్స్-గుప్టిల్ పాత్రపై సెప్టెంబర్‌లో సమీక్ష!

“చాలా అతృతగా ఉన్నాం. కామన్వెల్త్ గేమ్స్‌కు ఈ టీ20 ఫార్మాట్ ఖచ్చితంగా సరిపోతుంది. మహిళల క్రికెట్‌ను కామన్వెల్త్ గేమ్స్ లాంటి గ్లోబల్ స్టేజిపై ఆడటం అది గేమ్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. తర్వాత తరం క్రికెటర్లకు సైతం స్ఫూర్తినిస్తుంది. 2022 బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే ప్లేయర్లు నిజంగా అదృష్టవంతులు. ఇదొక మరిచిపోలేని అనుభూతినిస్తుంది” అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్నే తెలిపాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here