చికిత్స పొందుతూ వివాహిత మృతి

0
0


చికిత్స పొందుతూ వివాహిత మృతి


జ్యోతి (పాతచిత్రం)

నస్రుల్లాబాద్‌(బీర్కూర్‌), న్యూస్‌టుడే: నస్రుల్లాబాద్‌ మండల కేంద్రానికి చెందిన బసగుట్ట జ్యోతి(25) అనే వివాహిత ఐదు రోజుల క్రితం భర్త చేతిలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై సందీప్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా కడెం గ్రామానికి చెందిన రాజుతో జ్యోతికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొన్ని నెలల నుంచి రాజు తన భార్యపై అనుమానం పెంచుకొన్నారు. అప్పట్నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. చివరకు కులపెద్దలను ఆశ్రయించడంతో వారు రాజీ కుదిర్చారు. దీంతో భార్యాభర్తలిద్దరూ గత కొద్ది రోజుల నుంచి నస్రుల్లాబాద్‌లోనే నివసిస్తున్నారు. జులై 29న ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో రాజు, జ్యోతిని తీవ్రంగా కొట్టి గాయపరిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో జ్యోతి సోదరి స్వాతి చూసి ఇరుగుపొరుగు వారిని పిలవడంతో భర్త పారిపోయాడు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై జ్యోతి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. రాజు పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

https://betagallery.eenadu.net/htmlfiles/136064.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here