చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

0
2


చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నిజామాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చంద్రశేఖర్‌ కాలనీకి చెందిన తిరుపతి(55) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్‌హెచ్‌వో ప్రభాకర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి తన ఇంటి ఆవరణలోని వేపచెట్టు కొమ్మలు తొలగిద్దామని ఆదివారం చెట్టుపైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు తీవ్రగాయమైంది. కుటుంబసభ్యులు ఆయన్ను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

https://betagallery.eenadu.net/htmlfiles/137608.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here