చిన్నదాన్ని బాగ్ మిస్సవుతున్నా అని హార్దిక్‌ పోస్ట్‌.. సాక్షి ధోనీ ఫన్నీ రిప్లై!!

0
0


రాంచీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగు నెలలుగా ధోనీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఈ పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్నాడు. ముఖ్యంగా ముద్దుల కుమార్తె జీవాతో సరదా సమయం గడుపుతున్నాడు. తన కూతురు చేసే అల్లరి పనులకు సంబందించిన ఫొటోలు, వీడియోలను.. ధోనీ, ఆయన సతీమణి సాక్షి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

India vs Bangladesh: ఒక్క మ్యాచ్‌తో ధోనీ, కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్!!

 'చిన్నదాన్ని బాగ్ మిస్సవుతున్నా:

‘చిన్నదాన్ని బాగ్ మిస్సవుతున్నా:

భారత జట్టు ఆటగాళ్లతో ధోనీ కుటుంబం ఎంతో సరదాగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. జీవాతో కలిసి అందరూ ఆడుకుంటుంటారు. అయితే ధోనీని, జీవాను మిస్‌ అవుతున్నట్లు భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో.. ‘చిన్నదాన్ని బాగ్ మిస్సవుతున్నా. పెద్ద మనిషి ధోనీని కూడా’ అంటూ పోస్ట్‌ చేశాడు.

రాంచీలో నీకు ఇల్లు ఉంది:

రాంచీలో నీకు ఇల్లు ఉంది:

హార్దిక్‌ పాండ్యా పోస్ట్‌కు ధోనీ సతీమణి సాక్షి ఫన్నీ రిప్లై ఇచ్చారు. ‘హార్దిక్‌.. నీకు తెలుసా? రాంచీలోనూ నీకు ఓ ఇల్లు ఉంది’ అని కామెంట్‌ చేశారు. అయితే సాక్షికి హార్దిక్‌ కూడా రిప్లై ఇచ్చాడు. ‘అవును. నాకు తెలుసు. ధన్యవాదాలు సాక్స్’ అని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు కూడా తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు.

గతంలో స్విమ్మింగ్ పూల్‌ ఫొటో:

గతంలో స్విమ్మింగ్ పూల్‌ ఫొటో:

ధోనీ, జీవాలతో కలిసి ఉన్న ఫోటోని పాండ్యా పోస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ ముగ్గురూ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోని కూడా హార్ధిక్ పాండ్యా తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అందులో జీవా కలర్‌పుల్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్‌ను ధరించింది.

లండన్‌లో శస్త్రచికిత్స:

లండన్‌లో శస్త్రచికిత్స:

ఇటీవలే పాండ్యాకు లండన్‌లో వెన్నునొప్పి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్‌ ఆడుతుండగా హార్దిక్‌ వెన్నునొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స కారణంగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు హార్దిక్ దూరమయ్యాడు.

ఒకే ఒక సెంచరీ:

ఒకే ఒక సెంచరీ:

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పాండ్యా చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 26 ఏళ్ల హార్దిక్ జాతీయ జట్టు కోసం 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ చేసాడు. టెస్టుల్లో నాలుగు, వన్డేల్లో నాలుగేసి అర్ధ సెంచరీలు చేసాడు. టీ20లో 33 టాప్ స్కోర్.

స్టాన్కోవిక్‌తో డేటింగ్‌:

స్టాన్కోవిక్‌తో డేటింగ్‌:

గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా సినీ నటి, డ్యాన్సర్ నటాషా స్టాన్కోవిక్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మేలో పాండ్యానే స్వయంగా నటాషాను తల్లిదండ్రులకు పరిచయం చేశాడని తెలుస్తోంది. పాండ్యా తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించారని.. త్వరలోనే వీరి పెళ్లి జరిపించేందుకు సిద్ధమైనట్లు కూడా సమాచారం తెలుస్తోంది. ఇక పాండ్యా సోదరుడు కృనాల్ కూడా వీరి పెళ్ళికి ఓకే చెప్పాడట.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here