చిన్ననాటి స్నేహితులతో ధోని గల్లీ క్రికెట్: సోషల్ మీడియాలో వీడియో వైరల్

0
2


హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొన్ని నెలలు విరామం తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా, మంగళవారం మహేంద్ర సింగ్ ధోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో ధోని బౌలర్ కాగా, బ్యాట్స్‌మన్‌గా అతడి చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. ధోని వేసిన బంతికి వికెట్ పడినప్పటికీ… అతడు మాత్రం క్రీజు వదిలి వెళ్లేందుకు నిరాకరించాడు. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

స్ట్రీట్ క్రికెట్‌లో భాగంగా ధోని వేసిన బంతికి అతడి స్నేహితుడు ఔటవుతాడు. అయితే, అతడు బ్యాట్ ఇవ్వకుండా “ట్రైల్ బాల్”, “అంఫైర్ డెసిషన్ ఈజ్ పైనల్” అని అనడాన్ని మనం చూడొచ్చు. సాధారణంగా స్ట్రీట్ క్రికెట్‌‍లో చిన్న పిల్లలు ఆడేటప్పుడు ఈ రకమైన ఆటను మనం గమనిస్తూ ఉంటాం.

ఫన్నీ వీడియోని పోస్టు చేసిన ధోని

మొదటి బంతికి ఔటైతే అది ‘ట్రైల్ బాల్’ అని అంటుంటాం. ఇప్పుడు ధోని పోస్టు చేసిన వీడియోలో కూడా అతడు స్నేహితుడా అలాగే అనడం చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ “కెమెరా స్టార్ట్ అయిన తదుపరి నిమిషంలో ఏమి జరగబోతుంది మీకు తెలిసినప్పుడు. సారీ బ్యాడ్ లైట్, ట్రైల్ బాల్, అంఫైర్ డెసిషన్ లాస్ట్ డెసిషన్. స్కూల్ డేస్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ వీడియో లేకపోతే అతడు ఔటైన విషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోడు. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ దీనిని చూసే ఉంటారు. ఎంజాయ్” అంటూ కామెంట్ పెట్టాడు.

నవంబర్ వరకు క్రికెట్‌కు ధోని దూరం

నవంబర్ వరకు క్రికెట్‌కు ధోని దూరం

ఇదిలా ఉంటే, 2019 ప్రపంచకప్‌లో చివరిసారిగా ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన విరామాన్ని నవంబర్ వరకు పొడిగించనున్నారని సమాచారం తెలుస్తోంది. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరంగా ఉన్న ధోనీ.. స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం.

భారత ఆర్మీకి సేవలు

భారత ఆర్మీకి సేవలు

సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచే ధోనీకి చివరిది అని ప్రచారం సాగింది. కానీ.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రెండు నెలల విరామం తీసుకుని భారత ఆర్మీలో సేవలందించాడు. విధుల్లో భాగంగా 106 టెరిటోరియల్ ఆర్మీ (పారా బెటాలియన్)లో సేవ చేయడానికి 15 రోజులు కాశ్మీర్‌లో గడిపాడు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్ళాడు.

బంగ్లా సిరిస్‌కు ధోని దూరమే!

బంగ్లా సిరిస్‌కు ధోని దూరమే!

క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికి వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేని ధోనీ.. సెప్టెంబర్‌ 24 నుంచి జరగనున్న విజయ్‌ హజారే ట్రోఫీ, నవంబర్‌లో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం తెలుస్తోంది. అంతేకాదు ధోనీ సెలక్షన్‌ కమిటీకి నవంబర్‌ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here