చిన్నమ్మ అంటూ కుప్పకూలిన గులాటీ.. పిల్లాడిలా రోదించిన వ్యాపార దిగ్గజం (వీడియో)

0
0


చిన్నమ్మ అంటూ కుప్పకూలిన గులాటీ.. పిల్లాడిలా రోదించిన వ్యాపార దిగ్గజం (వీడియో)

న్యూఢిల్లీ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతి వార్తను ఆమెతో సాన్నిహితంగా మెలిగేవారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కుమిలిపోతున్నారు. ఆమెకు అంజలి ఘటించేందుకు భారమైన హృదయంతో వస్తున్నారు. నిర్జీవంగా ఉన్న సుష్మను చూసి బోరున కంటతడి పెడుతున్నారు. మరికొందరు సుష్మ భౌతికకాయం వద్దే తూళ్లిపడిపోతున్నారు. సుష్మ అని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

మంచికి మారుపేరు సుష్మ స్వరాజ్.. ఆమె ఆకాల మరణం సన్నిహితులకు షాక్‌నకు గురిచేసింది. సుష్మాను కడసారి చూసేందుకు వచ్చారు ఎండీహెచ్ వ్యవస్థాపకులు మహశయ్ ధరమ్‌పాల్ గులాటీ. 96 ఏళ్ల వయస్సులోనూ యాక్టివ్‌గా ఉన్న గులాటీ .. సుష్మను చూసి పిల్లాడిలా కంటతడి పెట్టారు. శవపేటికలో త్రివర్ణ పతాకం కప్పిన సుష్మ స్వరాజ్ అచేతనంగా ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయారు. సుష్మ అంటు బోరున విలపించారు. అక్కడే తూళ్లిపడిపోయారు. సుష్మ పాదాల వద్ద అంజలి ఘటించాక ఏడవడంతో .. అక్కడున్న వారు కూడా కంటితడి పెట్టుకున్నారు.

ఎప్పటిలాగే సుష్మ స్వరాజ్‌కు అంజలి ఘటించేందుకు వచ్చిన గులాటీ .. భావోద్వేగానికి గురయ్యారు. తలకు ఎర్రని తలపాగా చుట్టుకొని, నెరిసిన మీసంతో వచ్చిన ఆయన .. ఒక్కసారిగా ఏడ్చారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మ స్వరాజ్ భౌతిక కాయం వద్ద చిన్నపిల్లాడి మాదిరిగా కన్నీటిపర్యంతమయ్యారు గులాటి. ఆయనను ఆపడం ఎవరితరం కాలేదు. గులాటీ రోదనతో సుష్మ భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బన్సాల్ కూడా కుప్పకూలిపోయారు. సుష్మ లేరనే విషయాన్ని భరించలేని ఆమె అత్తగారు, తల్లిగారి కుటుంబాలు కళ్ల నుంచి వస్తోన్న నీటిని ఆపుకోని మరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here