చిన్న మొత్తాల పొదుపు పథకాలు… వడ్డీ రేటు తగ్గితే ఏంచేయాలి?

0
4


చిన్న మొత్తాల పొదుపు పథకాలు… వడ్డీ రేటు తగ్గితే ఏంచేయాలి?

భారత రిజర్వ్ బ్యాంకు రెపో రేటును తగ్గిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ రుణ, డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరుణంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు దిగి వస్తున్నాయి. వచ్చే నెల ప్రారంభంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేటును ప్రకటించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకాలపై వడ్డీ రేటు మరింత తగ్గవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ పథకాలు

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో సీనియర్ సిటిజెన్స్ స్కీం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, పోస్టాఫీస్ డిపాజిట్లు ఉంటాయి. జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి గాను చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును 0.1 శాతం మేర తగ్గించారు. ఎక్కువ వడ్డీ రేటు తగ్గుతుందని చాలా వర్గాలు భావించాయి. కానీ అందుకు భిన్నంగా ప్రకటన వెలువడటంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈసారి ఆవిధంగా ఉండకపోవచ్చని అంటున్నారు. ఈసారి వడ్డీ తగ్గింపు ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇలా చేయండి...

ఇలా చేయండి…

*ఎవరైనా మంచి వడ్డీ రేటు వస్తుందని, రిస్క్ ఉండదని చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే వడ్డీరేటు తగ్గడం వల్ల నిరాశ ఎదురవుతుంది. అలాంటప్పుడు స్థిర వడ్డీరేటు ను అందించే పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయం అవుతుంది.

స్థిర, చర వడ్డీ రేటు ఉత్పత్తులు

స్థిర, చర వడ్డీ రేటు ఉత్పత్తులు

* చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో స్థిర, చర వడ్డీ రేటు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, బాలికల కోసం తెచ్చిన సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో వడ్డీ రేట్లు మొత్తం పథక కల పరిమితిలో మారు తుంటాయి. ప్రస్తుత కాలంలో ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో ఇవి తగ్గడానికి లేదా త్రైమాసికాల వారీగా మార్పుకు చేర్పులు ఉండటానికి అవకాశం ఉంటుంది.

స్థిర రేట్లు ఉంటే

స్థిర రేట్లు ఉంటే

* అయితే స్థిర రేట్లు ఉంటే అవి పథకం ప్రారంభం నుంచి చివరి వరకు అమల్లో ఉంటాయి. దేని వల్ల ఎక్కువ వడ్డీరేటు పొందడానికి అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పథకాల్లో కొత్తగా ప్రకటించే వడ్డీ రేట్లు నిర్దేశిత త్రైమాసిక పెట్టుబడులకు అమలవుతాయి. ఆ రేటు మిగితా కాలానికి అమల్లో ఉంటుంది.

* ఈ కేటగిరీ లో నేషనల్ సేవింగ్స్ సెర్టిఫికెట్లు, సీనియర్ సేవింగ్స్ స్కీం, కిసాన్ వికాస్ పత్ర, పోస్ట్ ఆఫీస్ టైం , రేకరింగ్ డిపాజిట్లు వస్తాయి.

* ఈ కేటగిరీ స్కీమ్స్ దీర్ఘకాలానికి అధిక వడ్డీ రేట్లను అందించడానికి అవకాశం ఉంటుంది.

భద్రత....

భద్రత….

* చిన్న మొత్తాల పొదుపు పథకాలను పోస్ట్ ఆఫీస్, కొన్ని బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. వీటికి ప్రభుత్వ హామీ ఉండటంతో పెట్టుబడులకు ఎక్కువ భద్రత ఉంటుంది. బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

* కొన్ని పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడులపై పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి

– పీపీఎఫ్, ఎన్ ఎస్ సీ , ఎస్ సీ ఎస్ ఎస్ , ఎస్ ఎస్ వై, ఐదేళ్ల టైం డిపాజిట్ లపై ఆదాయ పన్ను చట్టం లోని సెక్షన్ 80 సీ కింద 1.50 లక్షల వరకు మినహాయింపును పొందడానికి అవకాశం ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here