చిన్న వ్యాపారాల కొత్త వేదిక…. ఇన్‌స్టాగ్రామ్! రూ.కోటి టర్నోవర్ సాధించిన ఢిల్లీ యువతీ

0
0


చిన్న వ్యాపారాల కొత్త వేదిక…. ఇన్‌స్టాగ్రామ్! రూ.కోటి టర్నోవర్ సాధించిన ఢిల్లీ యువతీ

ఇటీవలి కాలంలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువైంది. పొద్దున లేవగానే ముందు చూసేది సోషల్ మీడియా అప్డేట్స్ అంటే అతిశయోక్తి కాదు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ … ఇవి లేనిదే పొద్దు గడవదు. తమ రోజు వారి కారక్రమాల అప్డేట్స్ మిత్రులు, బంధువులతో పంచుకొంటూ …. అటువైపు వారి అప్డేట్స్ కూడా తెలుసుకొనేందుకు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. అయితే, సోషల్ మీడియా సంస్థలు కేవలం అప్డేట్స్ కు మాత్రమే పరిమితం కావడం లేదు. ఈ వేదిక లను వ్యాపారాలు ప్రమోట్ చేసుకొనేందుకు కూడా తీర్చిదిద్దుతున్నాయి.

ఫేస్బుక్, వాట్సాప్ లు ఈ మేరకు చాలా ముందుకు వెళ్లిపోయాయి కూడా. కానీ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ సరికొత్త వ్యాపార కేంద్రంగా అవతరిస్తోంది. కుటీర పరిశ్రమలు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఇంస్టాగ్రామ్ వేదికగా నేరుగా కస్టమర్ల కు తమ ఉత్పత్తులను విక్రయించుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. కేవలం ఇంస్టాగ్రామ్ వేదికగా రూ కోటి టర్నోవర్ సాధించిన ఢిల్లీ యువతి వంటి సక్సెస్ స్టోరీలు అనేకం కనిపిస్తున్నాయి. ఇవి మరింత మంది చిన్న వ్యాపారులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

రూ 5,000 ల పెట్టుబడి… రూ 1 కోటి టర్నోవర్…

దేశ రాజధాని ఢిల్లీ లోని జనకపురి లో ఒక చిన్న హ్యాండ్లూమ్ షాప్ నిర్వహించే కృతి చౌదరి … కేవలం రూ 5,000 పెట్టుబడి తో 2016 లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. సంస్కృతిక్ వస్త్రశాల పేరుతో ఇంస్టాగ్రామ్ హేండిల్ కలిగిన ఈ షాప్ నకు 20,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. కృతి ప్రతి రోజు మధ్యాన్నం 12 గంటలకు కేవలం 30 డిజైనర్ దుస్తుల కేటలాగ్ ఉంచుతుంది. కొన్ని నిమిషాల్లోనే అవన్నీ బుక్ ఐపోతాయని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఇంత పాపులర్ ఐన ఈ స్టోర్ వార్షిక టర్నోవర్ రూ 1 కోటి కి చేరుకొందని ఈ పత్రిక పేర్కొంది. కేవలం ఇంస్టాగ్రామ్ వేదికగా ఇంత వ్యాపారం సాధ్యకావడం విశేషమని అభిప్రాయపడింది.

మూడేళ్లుగా ప్రయత్నాలు...

మూడేళ్లుగా ప్రయత్నాలు…

ఇంస్టాగ్రామ్ గత మూడేళ్ళుగా తన ప్లేట్ ఫారం లో వ్యాపారాలను ప్రోత్సహించటం ప్రారంభించింది. అయితే, మెల్ల మెల్లగా ఇప్పుడు ఫలితాలు రావడం మొదలైంది. ఇంస్టాగ్రామ్ యూజర్లు ఒక ఫోటో లేదా వీడియో తో పాటు షాప్ నౌ టాగ్ లను జోడించ వచ్చు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేయగలిగిన మార్కెట్ పరిమాణం 2021 నాటికీ $10 బిలియన్ డాలర్లు (రూ 70,000 కోట్లు) ఉంటుందని డాయిష్ బ్యాంకు అంచనా వేసింది. బోలెడంత వ్యాపార అవకాశాలు ఉన్నాయ్ కాబట్టి … ఇంస్టాగ్రామ్ సహా అన్ని రకాల సోషల్ మీడియా వేదికలు దీనిని ఒక ఆదయ మార్గంగా మార్చుకొంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంస్టాగ్రామ్ రెఫరెల్స్ లో 100% నికి పైగా వృద్ధి నమోదు అవుతోందట.

మరో అడుగు ముందుకు...

మరో అడుగు ముందుకు…

చిన్న వ్యాపారులకే పరిమితం కాకుండా … ఇంస్టాగ్రామ్ ఇటీవలే అడిడాస్, జార, నైకీ వంటి ఎంపిక చేసిన బడా కంపెనీలకు నేరుగా చెక్ అవుట్ ఆప్షన్ అందిస్తోంది. అమెరికా లో ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించింది. త్వరలోనే భారత్ లోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరో వైపు దేశీయంగానూ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గి యాప్ డౌన్లోడ్ సహా ప్రమోషనల్ యాడ్స్ కూడా ఇస్తోంది. ఈ ప్రమోషన్ ద్వారా స్విగ్గి కి 30% తక్కువ ఖర్చుతో సుమారు 17% అధిక రిజల్ట్స్ కనిపించాయని ఫేస్బుక్ ఇండియా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ డైరెక్టర్ అర్చన వోహ్రా తెలిపారని ది ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఇంస్టాగ్రామ్ ను ఫేస్బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

బిజినెస్ అకౌంట్స్ కు మెరుగైన ఆదరణ...

బిజినెస్ అకౌంట్స్ కు మెరుగైన ఆదరణ…

ఇంస్టాగ్రామ్ లో బిజినెస్ అకౌంట్ల ను దాదాపు 80% యూజర్లు ఫాలో అవుతున్నారట. 90 మిలియన్ యూజర్లు బిజినెస్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. సుమారు 200 మిలియన్ యూజర్లు నెలకు ఒక సారైనా బిజినెస్ అకౌంట్లను విసిట్ చేస్తున్నారు. ఒక్కో బిజినెస్ అకౌంట్ 30 వరకు హాష్ టాగ్ లను వినియోగించవచ్చు. అత్యధిక వ్యూస్ కలిగిన అకౌంట్ల లో మూడోవంతు బిజినెస్ వె కావడం విశేషం. వేదిక ఏదైతేనేం… ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మెరుగైన మార్కెట్ లభించి వారు జీవితంలో స్థిరపడితే అదే పదివేలు, మీరేమంటారు?Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here