చిరు ప్రమోషన్స్ షురూ.. అమితాబ్‌తో ఛాయ్, చిట్ చాట్

0
6


‘సైరా’ సినిమా ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారన్నది వాస్తవం. సినిమా విడుదలకు ఐదు రోజుల మాత్రమే ఉండగా ఇప్పటికీ ఇంకా సరైన ప్రచార కార్యక్రమాలను చేపట్టడంలేదని కొంత మంది మెగా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అందుకేనేమో, తన అభిమానులను నిరాశపరచకుండా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. ‘సైరా’ ప్రమోషన్స్‌ను షురూ చేసేందుకు టైమ్ సెట్ చేశారు.

‘సైరా’ హిందీ ప్రమోషన్స్ కోసం చిరంజీవి, రామ్ చరణ్ శుక్రవారం ముంబై బయలుదేరి వెళ్లారు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్‌తో చిరంజీవి చిట్ చాట్‌లో పాల్గొంటారట. ‘ఛాయ్ సెషన్ విత్ అమితాబ్’ పేరుతో ఈ ముఖాముఖి రేపు అన్ని హిందీ ఎంటర్‌టైన్మెంట్ ఛానెళ్లలో ప్రసారం అవుతుందని అంటున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్ర పోషించిన విషయం తెలిసిందే. హిందీ ట్రైలర్‌లో అమితాబ్ వాయిస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకే ప్రమోషన్స్ కూడా ఆయనతో మొదలుపెడుతున్నారు.

Also Read: ‘సైరా’లో పరుష పదాలు.. మ్యూట్‌తో మెగా అభిమానులకు నిరాశే!

ఇక, తెలుగులుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ‘సైరా’ ప్రమోషన్స్‌కు నిర్మాత రామ్ చరణ్ గట్టి ప్రణాళికే రచించారని అంటున్నారు. విడుదలకు ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఈలోపల వీలైనంత ఎక్కువగా ప్రచారం కల్పించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. చిరంజీవి ముంబై నుంచి రాగానే ఇక్కడ కూడా ఇంటర్వ్యూలు షురూ చేస్తారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here