చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

0
1


చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

బోధన్‌ గ్రామీణం : ఖరీఫ్‌ పంటలు చేతికందనున్న నేపథ్యంలో ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో సోయా, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని డీసీసీబీ ఛైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారీ పర్కొన్నారు. బోధన్‌ మండలం సాలూర సహకార సంఘ అధ్యక్షుడు బుద్దె రాజేశ్వర్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మహాజన సభకు హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 232 కేంద్రాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. ఏ గ్రేడు ధాన్యానికి మద్దతు ధర రూ.1,835, బీ గ్రేడుకు రూ.1,815, సోయా క్వింటాలుకు రూ.3,710 ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు తొందరపడి దళారులకు విక్రయించి నష్టపోవద్దన్నారు.త్వరలో ప్రారంభించనున్న కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మహాజన సభ వార్షిక నివేదికను కార్యదర్శి బస్వంత్‌రావు చదివి వినిపించారు. ఏకకాలంలో రుణమాఫీ, 6 శాతం రిబెట్‌, హమాలీ ఛార్జీలు రైతు ఖాతాల్లో జమ చేయాలని సమావేంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుద్దె సావిత్రి, సర్పంచులు చంద్రకళ, లక్ష్మి, సాయిలు, అంబదాస్‌, గంగారాం, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here