‘చీపురు’ తెచ్చిన తంట.. భర్తకు 50 నిమిషాల జైలు శిక్ష విధించిన కోర్టు!

0
3


జైలు శిక్ష అంటే నెలలు లేదా సంవత్సరాల్లో ఉంటుంది. ఇదేంటీ నిమిషాల్లో ఉందని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే అతడు చేసిన నేరం అలాంటిది మరి. ఇంతకీ ఏం చేశాడనే కదా మీ డౌట్? అయితే, ఇంగ్లాండ్‌లోని నార్త్ సొమెర్సెట్‌లోని పోర్టిషెడ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవలసిందే.

23 ఏళ్ల షేన్ జెన్కిన్స్ అనే యువకుడు ఇటీవలే తన భార్య నుంచి విడిపోయాడు. అయితే, ఆమెపై ఉన్న కోపం మాత్రం అతడిలో అలాగే ఉండిపోయింది. ఈ సందర్భంగా అతడి చీపురును తన ఇంటిపైకి విసిరి పారిపోయాడు. అది తగలి ఆమె ఇంటి కిటికీ పగిలిపోయింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మే 30న భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత జెన్కిన్స్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అప్పుడే ఆ కిటికీని ఇటుకతో బద్దలకొడతా అని వార్నింగ్ ఇచ్చాడు. చివరికి చీపురుతో కిటికీ అద్దాలను పగలగొట్టి తన పంతం నెగ్గించుకున్నాడు. ఈ కేసులో అరెస్టయిన జెన్కిన్స్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

జెన్కిన్స్ తరపు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ.. ‘‘జెన్కిన్స్ తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నాడు. ఆ రోజు అతిగా మద్యం తాగడం వల్ల అలా చేశాడు. పశ్చాతాపంతో కుమిలిపోతున్నాడు. ఆమెకు క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు’’ అని తెలిపాడు. దీంతో న్యాయమూర్తి జులియన్ లాంబెర్ట్‌ నిందితుడికి 50 నిమిషాల కారాగార శిక్ష విధించారు. పోలీసులకు, అతడి మాజీ భార్యకు క్షమాపణలు చెబుతూ లేఖ రాసి ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. అంతేగాక నాలుగు నెలల జైలు శిక్షకు బదులుగా 80 గంటలు జీతం లేకుండా సామాజిక సేవ చేయాలని, అలాగే మద్యానికి దూరంగా ఉండాలని ఆదేశించారు.
Photo credit: Getty ImagesSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here