చీపురు పట్టిన ఐఏఎస్ అధికారి.. రోజూ ఆఫీసును ఆయనే క్లీన్ చేస్తారు!

0
0


ఏఎస్ అధికారి చీపురు పట్టడం ఏమిటీ? రోజూ తన ఆఫీసును తానే క్లీన్ చేసుకోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, విధానమే అది. ఆయనకు ఈ అలవాటు మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు పారిశుద్ధ్య కార్మికులెవరూ క్లీనింగ్ కోసం ఆయన గదిలో అడుగు పెట్టలేదు. రోజూ 10 నిమిషాల ముందే ఆఫీసుకు వచ్చి ఆయన క్లినింగ్ పునులు చేపడతారు.

డాక్టర్ అజయ్ శంకర్ పాండే. ఘజియాబాద్ జిల్లా మెస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్నా.. చీపురు పట్టి తన గదిని శుభ్రం చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. తన కింద సిబ్బంది నవ్వుకున్నా.. పట్టించుకోరు. పారిశుద్ధ్య కార్మికులు ఉన్నా, లేకున్నా క్లీనింగ్ పనులు ఆపరు.

అలా మొదలైంది: 1993లో ఆగ్రా జిల్లా ఎత్మాద్పూర్‌లో అజయ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)గా పనిచేస్తున్నప్పుడు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. దీంతో ఆయన తన ఆఫీస్ గదిలోకి వెళ్లి చీపురు పట్టుకుని శుభ్రం చేశారు. ఆయన అలా చేయడం చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ‘‘మన పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే రోగాలు వస్తాయి. అది మీకు, మీ కుటుంబానికి మంచిది కాదు. పారిశుద్ధ్య కార్మికులు వచ్చే వరకు ఎందుకు ఎదురు చూస్తున్నారు? చెత్తను వదిలి పెట్టడమే అత్యంత అపరిశుభ్రమైన పని’’ అని అజయ్ తన సిబ్బందికి చెప్పారు. అప్పటి నుంచి ఆయన తన ఆఫీస్‌ను తానే శుభ్రం చేయడం మొదలుపెట్టారు.

అజయ్ ఆఫీస్ గది బయట హిందీలో ఓ బోర్డు ఉంటుంది. అందులో ‘‘ఈ ఆఫీసును నేనే శుభ్రం చేశాను. దయచేసి చెత్తాచెదారాన్ని పెంచి నాకు పనిపెట్టకండి’’ అని రాశారు. ఎస్డీఎం పోస్ట్ తర్వాత అజయ్ గోరక్‌పూర్, కాన్‌పూర్, గజియాబాద్ మున్సిపల్ కమీషనర్‌గా, మీరట్ అడిషనల్ డివిజనల్ కమిషనర్‌గా పనిచేశారు.

ప్రజలు మందుకురారు: పరిశుభ్రత అనేది కేవలం ఒక వర్గానికి చెందినవాళ్లే చేయాలనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. దీనివల్ల చెత్తను తీయడానికి కూడా సంకోచిస్తారని తెలిపారు. ఇళ్లల్లో మహిళలు మాత్రమే ఇంటిని శుభ్రం చేయాలని పురుషులు భావిస్తారని, మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలనే ఆలోచన కూడా వారికి రాదన్నారు. ‘‘నేను మున్సిపాల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు సుమారు 6 వేల వరకు పారిశుధ్య కార్మికులు ఉండేవారు. వారిలో ఏ ఒక్కరితో కూడా నా ఆఫీసును క్లీన్ చేయించలేదు’’ అని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ భారత్ వల్ల ప్రజలకు మంచి సందేశం వెళ్తుందని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే తపన పెరుగుతుందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here