చీరలు బాగున్నాయ్‌

0
4


చీరలు బాగున్నాయ్‌

జడ్పీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు

చీరలు పంపిణీ చేస్తున్న విఠల్‌రావు

మాక్లూర్‌, న్యూస్‌టుడే: గతంతో పోలిస్తే ఈ సారి బతుకమ్మ చీరలు బాగున్నాయని జడ్పీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు కితాబిచ్చారు. ఎంతో నాణ్యత ఉన్న చీరలను అర్హులందరికీ అందజేస్తున్నట్లు చెప్పారు. గురువారం మాక్లూర్‌లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, తెదేపా హయాంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరుగున పడ్డాయని పేర్కొన్నారు. 2006లో మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఏర్పాటైన జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మ, బోనాల పండగకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. తెరాస అధికారంలో వచ్చాక అన్ని మతాలవారికి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం దుర్గానగర్‌లో కొనసాగుతున్న ప్రణాళిక పనులను గురువారం విఠల్‌రావు పరిశీలించారు. కొద్దిసేపు ట్రాక్టర్‌తో రహదారిని చదును చేశారు. సర్కారు చేపట్టిన ప్రత్యేక ప్రణాళికను విజయవంతం చేయాలని కోరారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్‌, తహసీల్దార్‌ భూపతి, సర్పంచి అశోక్‌రావు, ఎంపీటీసీ సభ్యురాలు మీరాబాయి, కోఆప్షన్‌ సభ్యుడు కోక హైమద్‌, ఉప సర్పంచి అనిత, నాయకులు కాచర్ల లక్ష్మీనారాయణ, సాయిలు, నారాయణ, గంట లక్ష్మణ్‌, రాచర్ల గంగారాం తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here