చుర్రుమంటున్న ‘చురు’

0
3


చుర్రుమంటున్న ‘చురు’

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: సాధారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటితేనే విలవిలలాడిపోతాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు కూడా దాటుతాయి. అయితే రాజస్థాన్‌లోని చురు  జిల్లాలో ఉష్ణోగ్రతలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 50 డిగ్రీలకు చేరడంతో అక్కడి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలు థార్‌ ఎడారిలో ఉన్నాయి. ఎడారిలో అంత ఉష్ణోగ్రతలు నమోదు కాకుండా ఎడారి ప్రారంభమయ్యే చురులో నమోదు కావడం గమనార్హం. చురులో ఇంతగా ఉష్ణోగ్రతలు ఉండేందుకు పలు కారణాలున్నాయి.
గాలి గమనం
వేసవిలో  వేడిగాలులు జైసల్మేర్‌ నుంచి చురు దిశగా వీస్తాయి. దీంతో ఎడారి ప్రాంతంనుంచి వచ్చే గాలులు కావడంతో వడగాలులుగా మారుతాయి. ఇక్కడ పచ్చదనం కూడా తక్కువ కావడంతో వేసవి తీవ్రంగా మారుతుంటుంది.
నీటివనరులు తక్కువ
ఇక్కడ భూగర్జ జలాలు తక్కువగా ఉంటాయి. జిల్లాలో నీటివనరులు అంతంత మాత్రమే. ఇసుక దిబ్బలు కూడా ఎక్కువగా ఉండటంతో పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుంటాయి. వర్షపాతం కూడా తక్కువగా ఉంటుంది. జిల్లా వరకు వచ్చే కాలువలు కూడా లేవు.
ఇసుకదిబ్బలు…
చురు చుట్టు పక్కల థార్‌ఎడారిలో పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు ఏర్పడుతుంటాయి. ఎటు పక్క చూసినా ఇవే ఉండటంతో  గ్రీష్మతాపం భారీగా ఉంటుంది. గాలి ప్రభావంతో ఇసుకదిబ్బలు చలనం చెందుతుంటాయి. 
చలికాలంలోనూ నరకమే..
చురులో శీతాకాలం కూడా నరకప్రాయంగా ఉంటుంది. ఈ కాలంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు చేరుతుంటుంది. ఫలితంగా జనజీవనం ఇబ్బందికరంగా మారుతుంది. వేసవిలో 50 డిగ్రీలు దాటే ఉష్ణోగ్రతలు చలికాలంలో సున్నా డిగ్రీలకు చేరడం గమనార్హం. వాయువ్యం నుంచి వీచే చలిగాలుల ప్రభావంతో ఇలా జరుగుతుంది.

Tags :

  • Churu
  • summer
  • RajastanSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here