చెత్త‌కు ఆహారం ప‌థ‌కం: ఉచితంగా టిఫిన్‌, భోజ‌నం..గార్బెజ్ కేఫ్ స‌క్సెస్‌!

0
1


చెత్త‌కు ఆహారం ప‌థ‌కం: ఉచితంగా టిఫిన్‌, భోజ‌నం..గార్బెజ్ కేఫ్ స‌క్సెస్‌!

రాయ్‌పూర్‌: ఇప్ప‌టిదాకా ప‌నికి ఆహారం ప‌థ‌కం గురించి విన్నాం. అధికారులు సూచించిన ప‌ని చేయడం దానికి త‌గ్గ ల‌బ్ధిని పొంద‌డం ఈ ప‌థ‌కం ఉద్దేశం. ఇదే కాన్సెప్ట్‌ను కాస్త అటు, ఇటుగా మార్చారు. చెత్త‌కు ఆహారం ప‌థ‌కంగా మార్చారు. చెత్త‌ను తీసుకుని రావ‌డం ఉచితంగా క‌డుపు నిండా భోజ‌నం చేయడం ఇది దీని కాన్సెప్ట్‌. ఓ కిలో చెత్త‌ను ఏరుకుని మున్సిపాలిటీ అధికారుల‌కు అంద‌జేస్తే.. ఓ పూట భోజ‌నం ఉచితంగా పెడతారు. అర‌కిలో చెత్త‌ను తీసుకెళ్లి వారి చేతిలో పెడితే- ఓ పూట టిఫిన్ చేసేయొచ్చు. ఉచితంగానే.

  ప్లాస్టిక్ వాడకం పై అవగాహన

  చెత్త‌ను నివారించ‌డంలో భాగంగా- ఈ వెరైటీ ప‌థ‌కానికి తెర తీశారు ఛ‌త్తీస్‌గ‌ఢ్ అధికారులు. ఆ రాష్ట్రంలోని అంబికాపూర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో దీన్ని తొలిసారిగా ప్ర‌యోగాత్మకంగా అమ‌లు చేస్తున్నారు. అది విజ‌య‌వంతమైంది. దీనితో మ‌రిన్ని కార్పొరేష‌న్ల‌కు విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు అధికారులు.

  Garbage Cafe In Chhattisgarh To Offer Free Food In Exchange For Plastic

  ఈ ప‌థ‌కంలో భాగంగా- పేద‌లు, చెత్త ఏరుకునే వాళ్లు నివ‌సించే ప్రాంతాలు, మురికివాడ‌ల్లో గార్బెజ్ కేఫ్ పేరుతో హోట‌ల్‌ను ఆరంభించారు. ఇటీవ‌లే ఈ హోట‌ళ్ల‌ను అంబికాపూర్ మేయ‌ర్ డాక్టర్ అజయ్ టిర్కీ ప్రారంభించారు. ఈ హోట‌ల్‌లో చెత్తను తీసుకుని ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు. కిలో చెత్తను సేకరించి మున్సిపల్ కార్యాలయంలో అందజేసిన వారికి కడుపు నిండా భోజనం..అర కిలో చెత్తకు టిఫిన్ ఇస్తారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల పేదలకు కడుపునిండా భోజనం దొరుకుతోంది. దీని ప్ర‌భావం వ‌ల్ల అంబికాపూర్‌లో చెత్త సేకరించేవారి సంఖ్య పెరుగుతోంది.

  Garbage Cafe In Chhattisgarh To Offer Free Food In Exchange For Plastic

  ఈ ప‌థ‌కం విజ‌య‌వంతం కావ‌డం వ‌ల్ల మ‌రిన్ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్లకు విస్త‌రింప‌జేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్ల‌డించారు. చెత్త‌ను ఏరుకునే వారి సంఖ్య పెర‌గ‌డం వ‌ల్ల న‌గ‌రంలో ఎక్క‌డే గాని అప‌రిశుభ్ర‌త అనేదే లేకుండా పోయింద‌ని వారు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here