చెత్త వేస్తే జరిమానా వేయండి…

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని అయినా వినకుంటే జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన ఆదివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోను, ఇందల్వాయి మండల కేంద్రంలోను, జక్రాన్‌పల్లి మండల కేంద్రం లోను, మునిపల్లి గ్రామంలో పర్యటించి హరితహారం, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ముఖ్య రహదారులో బస్టాండ్‌ చుట్టుపక్కల మురికినీరు, చెత్త ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉండడంపై శుభ్రం చేయకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత గ్రామ కార్యదర్శి సరిగా సహకరించడం లేదని అధికారులు తెలపడంతో అతనికి జిల్లా పంచాయతీ అధికారి ద్వారా షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ఇందల్వాయి మండల కేంద్రంలో బస్టాండు చుట్టుపక్కల చెత్త తొలగించక పోవడం, దుకాణదారులు వారి దుకాణాల వద్ద పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, బస్టాండ్‌లో గల త్రాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు ఉపయోగంలో లేకపోవడంపై బస్టాండ్‌ ఇన్‌చార్జిని ప్రశ్నించారు. జిల్లా ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌తో మాట్లాడి వెంటనే వాటిని పునరుద్ధరించాలని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here