చేజేతులా ఓవర్‌త్రోపై కేన్! గుప్టిల్ రూపంలో కివీస్ జట్టుకు దరిద్రం శనిలా!

0
0


హైదరాబాద్: లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశాలు ఉన్నప్పటికీ, మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌త్రో మ్యాచ్‌నే మలుపు తిప్పింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆ ఓవర్‌త్రోపై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ “అత్యంత కీలక సమయంలో బంతి అలా స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లడం చాలా బాధాకరం. ఇది అస్సలు బాగోలేదు. ఇలాంటి ఘటన భవిష్యత్‌లో పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా” అని విచారం వ్యక్తం చేశాడు.

అసలేం జరిగిందంటే

అసలేం జరిగిందంటే

ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి ఓవర్‌ చివరి మూడు బంతులకు గాను 9 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌ చేయగా బెన్‌స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా బాదాడు. రెండు ప‌రుగులు తీశాడు. రెండు ప‌రుగుల‌తోనే ఆగిపోవాల్సిన ప‌రిస్థితి అది. రెండో పరుగును కోసం ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో బెన్ స్టోక్స్ కీపర్ ఎండ్‌కు వెళ్తూ రనౌట్ నుంచి తప్పించుకోవ‌డానికి క్రీజులోకి డైవ్ చేశాడు.

బంతి స్టోక్స్‌కు తగిలి బౌండరీకి

బంతి స్టోక్స్‌కు తగిలి బౌండరీకి

న్యూజిలాండ్ ఫీల్డర్ నుంచి వచ్చిన బంతి స్టోక్స్‌కు తగిలి బౌండరీకి తరలింది. దీంతో ఆ బంతికి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. స్టోక్స్ మొద‌ట చేసిన రెండు ప‌రుగుల‌తో పాటు.. బంతి బౌండ‌రీని త‌గ‌ల‌డం వ‌ల్ల వ‌చ్చిన నాలుగు ప‌రుగుల‌ను ఇంగ్లండ్ ఖాతాలో వేశారు. ఆ ప‌రుగులే గ‌న‌క లేక‌పోయి ఉంటే- మ్యాచ్ న్యూజిలాండ్ వైపు మొగ్గు చూపించి ఉండేదే! కాగా తన బ్యాట్‌ వల్ల ఓవర్‌త్రో రావడంపై బెన్‌స్టోక్స్‌ తన తప్పేమీ లేదని, అది అనుకోకుండా జరిగిపోయిందని విలియమ్సన్‌ జట్టుకు క్షమాపణలు చెప్పాడు.

రెండు బంతులకు మూడు పరుగులు అవసరమైన

రెండు బంతులకు మూడు పరుగులు అవసరమైన

ఆ తర్వాత రెండు బంతులకు మూడు పరుగులు అవసరమైన స్థితిలో స్టోక్స్‌ మళ్లీ రెండు పరుగులకు ప్రయత్నించాడు. ఒక పరుగు పూర్తిచేసి రెండో పరుగుకు వెళ్తుండగా అదిల్‌రషీద్‌ రనౌటయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. స్టోక్స్‌ మళ్లీ రెండు పరుగులకు ప్రయత్నించగా ఈసారి మార్క్‌వుడ్‌ రెండో పరుగుకు రనౌటయ్యాడు.

సూపర్ ఓవర్ కూడా టై

సూపర్ ఓవర్ కూడా టై

దీంతో ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ బౌల్‌​ వేసిన ఓవర్‌లో 15 పరుగులు సాధించింది. స్టోక్స్‌, బట్లర్‌లు బౌల్ట్‌ బౌలింగ్‌ల్‌ ఎదురుదాడికి దిగడంతో సూపర్ ఓవర్‌లో 15 పరుగులు రాబట్టారు. అనంతరం సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా, గుప్టిల్ రనౌట్‌ అయ్యాడు. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సాధించిన బౌండరీలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ నియమావళి ప్రకారం ఆ జట్టునే విజేతగా ప్రకటించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here