చేతివాటం చూపి..కెమెరాకు చిక్కి ‘ఎడమ చేతికి తెలీకుండా కుడిచేత్తో సాయం చేయాలనేది’ తెలుగు నానుడి. కానీ ముంబయిలో ఓ వ్యక్తి మాత్రం ఈ సామెతను దొంగతనం చేయడానికి వాడుకున్నాడు. కుడిచేతికి తెలీకుండా ఎడమచేతికి పనిచెప్పి తన ముందున్న వ్యక్తి జేబులో నుంచి వాలెట్‌ లాగేందుకు ప్రయత్నం చేశాడు. మరి ఈయన తన చేతి వాటం చూపిస్తుంటే కెమెరా కళ్లు ఊరుకుంటాయా? ఈయనగారి ఘనకార్యాన్ని మొత్తం రికార్డు చేశాయి. ఇది గమనించిన ఆ దొంగ నాలుక్కరుచుకుని దండం పెట్టి మరీ పర్సును ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చేశాడు.

0
1


చేతివాటం చూపి..కెమెరాకు చిక్కి

వైరల్‌ అవుతున్న వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఎడమ చేతికి తెలీకుండా కుడిచేత్తో సాయం చేయాలనేది’ తెలుగు నానుడి. కానీ ముంబయిలో ఓ వ్యక్తి మాత్రం ఈ సామెతను దొంగతనం చేయడానికి వాడుకున్నాడు. కుడిచేతికి తెలీకుండా ఎడమచేతికి పనిచెప్పి తన ముందున్న వ్యక్తి జేబులో నుంచి వాలెట్‌ లాగేందుకు ప్రయత్నం చేశాడు. మరి ఈయన తన చేతి వాటం చూపిస్తుంటే కెమెరా కళ్లు ఊరుకుంటాయా? ఈయనగారి ఘనకార్యాన్ని మొత్తం రికార్డు చేశాయి. ఇది గమనించిన ఆ దొంగ నాలుక్కరుచుకుని దండం పెట్టి మరీ పర్సును ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చేశాడు.

ఆసక్తి కర ఘటనలను, ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడండలో మొదటిస్థానంలో ఉండే ముంబయి పోలీసులు ఈ వీడియోను ట్విటర్‌లో సోమవారం పోస్టు చేశారు. ‘ఈ ఫన్నీ వీడియో చూడండి. అన్ని సార్లు ఇది నిజం కాకపోవచ్చు. అందరూ ఇలాగే ఉండరు.జాగ్రత్తగా ఉండండి’ అంటూ సోమవారం ఉదయం పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. పోస్ట్‌ చేసిన గంటల్లోపే దీనికి వేలల్లో లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

22 సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీన్ని పోస్ట్‌ చేస్తున్నామని, ముంబయి వ్యాప్తంగా అత్యంత రద్దీ ప్రదేశాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ముంబయి పోలీసులు తమ అధికారిక ట్విటర్‌ ఖాతా నుంచి ట్వీట్‌ చేశారు.

Tags :

  • fun theft
  • mumbai fun thiefSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here