చైతూ కంప్లీట్ హస్బెండ్ మెటీరియల్.. ఎన్టీఆర్‌తో చాలా కష్టం: సమంత

0
4


అస్సలు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చి సౌత్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్‌గా ఎదగడమే కాకుండా టాలీవుడ్‌లో గొప్ప పేరున్న అక్కినేని ఫ్యామిలీలో సభ్యురాలిగా మారిపోయారు సమంత. చిన్నప్పటి నుంచీ చదువులో ఫస్ట్ ఉన్న సమంత.. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి సినిమా ‘ఏ మాయ చేసావె’తోనే కుర్రాళ్ల మనసులు దోచేసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ హోదా పొందారు. తొలి సినిమాలో పనిచేసిన అక్కినేని నాగచైతన్యనే తన కొంగుకు కట్టేసుకున్నారు.

ఇదిలా ఉంటే, తన వ్యక్తిగత విషయాలను సమంత తాజాగా పంచుకున్నారు. మంచు లక్ష్మి హోస్ట్ చేస్తోన్న తెలుగు రియాలిటీ షో ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’లో పాల్గొన్న సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా విషయాలు వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా తన భర్త నాగచైతన్య గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘చైతన్యలో నువ్వు ఏం చూసావ్.. పెళ్లిచేసుకోవాలని ఎప్పుడు ఫిక్స్ అయ్యావ్’’ అని సమంతను లక్ష్మి అడిగారు.

Also Read: 14 ఏళ్లకే ముద్దుపెట్టా.. సాయి పల్లవిని పెళ్లిచేసుకుంటా: వరుణ్ తేజ్

దీనికి సమంత సమాధానం ఇస్తూ.. ‘‘అది మా ఫస్ట్ సినిమాలోనే ఫిక్స్. చైతన్య హస్బెండ్ మెటీరియల్ కదా..! ఆయన కంప్లీట్లీ హస్బెండ్ మెటీరియల్. నన్ను ఒక సాధారణ అమ్మాయి దగ్గర నుంచి స్టార్‌గా ఎదగడం వరకు చైతన్య చూశారు. ఫస్ట్ సినిమా సమయంలో యూఎస్‌లో ఉన్నప్పుడు మా అమ్మకు కాల్ చేయడానికి నా ఫోన్‌లో బ్యాలెన్స్ లేదు. అప్పుడు చైతన్య ఫోన్ నుంచి నేను అమ్మతో మాట్లాడాను. అప్పుడు మొదలైంది మా ప్రేమ’’ అని సమంత చెప్పుకొచ్చారు.

‘ఏమాయ చేసావె’ సినిమా షూటింగ్ సమయంలోనే చైతన్యను తన భర్తగా ఫిక్స్ అయిపోయాని సమంత అన్నారు. నాగచైతన్యకు బెడ్‌రూంలో ఫస్ట్ వైఫ్ పిల్లో అని సమంత సరదాగా చెప్పారు. తనను హగ్ చేసుకోవాలన్నా మధ్యలో పిల్లో ఉండాల్సిందేనని నవ్వుతూ అన్నారు. ఇక ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో చైతూ కాకుండా నీకు బాగా నచ్చిన యాక్టర్ ఎవరు?’’ అని సమంతను మంచు లక్ష్మి అడిగారు. దీనికి రామ్ చరణ్ అని సమంత సమాధానం ఇచ్చారు. ఆయనతో నటించడం చాలా ఈజీ అని అన్నారు.

Also Read: ఇది బెల్లీ డ్యాన్స్ కాదు.. ‘ఇల్లీ’ డ్యాన్స్

‘‘చాలా కష్టం బన్నీతో డ్యాన్స్ చేయడమా?’’ అని లక్ష్మి అడగగానే.. ‘‘నిజానికి జూనియర్ ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం’’ అని సమంత చెప్పారు. ‘‘బన్నీతో నేను వాకింగే.. నేను వాకింగ్ స్టార్ కదా! కానీ, రెండు మూడు పాటలు జూనియర్ ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేశా. అబ్బా నరకం. నేను చాలా కష్టపడి నేర్చుకుని చేస్తే.. ఆయన మాత్రం స్టైల్‌గా ఒకసారి చూసి డ్యాన్స్ చేసేస్తారు. నాకేమో చెమటలు పట్టేస్తాయి.. మేకప్ పోతుంది.. హెయిర్ స్టైల్ చెరిగిపోతుంది. కానీ, ఆయన చేతులు కట్టుకుని ఒకసారి చూసి చేసేస్తారు’’ అని సమంత నవ్వుతూ చెప్పారు. తమిళ స్టార్ విజయ్‌‌తో డ్యాన్స్ చేయడం కూడా చాలా కష్టమని సమంత అన్నారు. ఆయన కనీసం ప్రాక్టీస్ చేయకుండా అలా చూసి చేసేస్తారని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here