చైనాపై మరో 5% టారిఫ్ పెంచిన ట్రంప్, అమెరికన్లకు చుక్కలు!

0
0


చైనాపై మరో 5% టారిఫ్ పెంచిన ట్రంప్, అమెరికన్లకు చుక్కలు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీకి మరోసారి షాకిచ్చారు. యూఎస్-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఎంతమాత్రమూ తగ్గడం లేదు. అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్స్ విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ కూడా ట్విట్టర్ ద్వారా టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించారు. వారి ఉత్పత్తులపై 5 శాతం టారిఫ్ పెంచనున్నట్లు ప్రకటించి దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించారు.

అక్టోబర్ 1వ తేదీ నుంచి 30 శాతం టారిఫ్

చైనాకు చెందిన 550 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై ఐదు శాతం టారిఫ్స్ పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఈ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా వేయనున్న టారిఫ్స్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ప్రస్తుతం 250 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు 25% టారిఫ్స్ పరిధిలో ఉన్నాయి. వీటిని ట్రంప్ 30% శాతానికి పెంచారు.

అమెరికా ట్యాక్స్ పేయర్స్‌కే భారంగా మారింది

అమెరికా ట్యాక్స్ పేయర్స్‌కే భారంగా మారింది

గత తమప్రభుత్వాలు డ్రాగన్ కంట్రీ అనైతిక విధానాల్ని అనుమతించి సమతౌల్యతను దెబ్బతీశాయని, ఇది అమెరికా ట్యాక్స్ పేయర్స్‌కు భారంగా మారిందన్నారు. ఒక అధ్యక్షుడిగా తాను వీటిని ఇక అనుమతించేది లేదని ట్రంప్ ఖరాఖండిగా చెప్పారు. మరోవైపు, అమెరికాపై చైనా అధిక టారిఫ్‌ను యూఎస్ బిజినెస్ ప్రతినిధి ఖండించారు.

నేనంటే.. నేను

నేనంటే.. నేను

మరో 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై టారిఫ్స్ 10% నుంచి 15% పెంచారు. ఇవి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అంతకుముందు ఈ ఉత్పత్తులపై (300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 10 శాతం) ట్రంప్ టారిఫ్ పెంచడంతో చైనా అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్ పెంచింది. ఈ మేరకు చైనా కస్టమర్స్ టారిఫ్ కమిషన్ ప్రకటన చేసింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి అమెరికాలో తయారైన వాహనాలు, ఆటో విడిభాగాలపై అదనంగా 25% లేదా 5% టారిఫ్స్ విధించనున్నట్లు ప్రకటించింది. దీంతో ట్రంప్ 550 5 శాతం పెంచారు.

ఎన్నికల్లో ప్రభావం చూపనున్న అంశం

ఎన్నికల్లో ప్రభావం చూపనున్న అంశం

అమెరికా – చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికన్లు భారీగా ఖర్చు చేయవలసి వస్తోంది. భవిష్యత్తులో అమెరికన్లు ఏడాదికి సగటున దాదాపు 1000 డాలర్లు అదనంగా ఖర్చుపెట్టాల్సి వస్తోందని జేపీ మోర్గాన్‌ ఛేస్‌ పేర్కొంది. కొత్త టారిఫ్స్ రాకముందు అమెరికన్లు ఏటా 600 డాలర్లను అదనంగా వెచ్చిస్తున్నారు. అమెరికా ఎన్నికలు 2020లో జరగనుండంతో ఈ అంశం ప్రభావం చూపనుందని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికన్లు పన్ను రాయితీల నుంచి పొందుతున్న లబ్ధి మొత్తాన్ని ఈ ట్రేడ్ వార్ వల్ల నష్టపోతున్నారట.

మోడీ-ట్రంప్ భేటీ!

మోడీ-ట్రంప్ భేటీ!

ఇదిలా ఉండగా, బేరిడ్జ్ (ఫ్రాన్స్)లో ఆగస్ట్ 25న జరుగుతున్న G7 సమ్మిట్‌కు భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 26న ట్రంప్-మోడీలు చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి. అమెరికా – చైనా ట్రేడ్ వార్‌ను భారత్ దగ్గరి నుంచి పరిశీలిస్తోంది. దీని వల్ల భారత్ పైన ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here