చైనా ఓపెన్‌: సాయి ప్రణీత్‌ ఓటమి, సింగిల్స్‌లో ముగిసిన భారత పోరాటం

0
1


హైదరాబాద్: చైనా ఓపెన్‌ బ్యాడ్మంటన్‌ టోర్నీలో సింగిల్స్‌ విభాగంలో భారత్‌ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌ 20-22, 22-20, 16-21 తేడాతో ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు.

ఫలితంగా చైనా ఓపెన్ టోర్నీ సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్‌.. రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. అయితే, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో స్వీయ తప్పిదాల కారణంగా గేమ్‌తో మ్యాచ్‌ను కూడా కోల్పోయాడు.

25 ఏళ్లు దేశానికి ఆడా!: కెప్టెన్సీ తొలగింపు, పాక్‌తో డేవిస్ కప్‌ పోరుపై మహేశ్ భూపతి ఆవేదన

మూడో గేమ్‌ చివర్లో ప్రణీత్ పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రణీత్‌ ఓటమితో భారత్‌ సింగిల్స్‌లో పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్లు పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా… రెండో రౌండ్‌లో సైనా నెహ్వాల్ ఇంటి దారి పట్టింది.

బుధవారం తొలి రౌండ్లో 8వ సీడ్‌ సైనా 9-21, 12-21తో 22వ ర్యాంకర్‌ కాయ్‌ యాన్‌ (చైనా) చేతిలో చిత్తుగా ఓడింది. సైనా కేవలం 24 నిమిషాల్లోనే ప్రత్యర్థి ముందు తలవంచింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌ చేరిన సైనా అంతకుముందు డెన్మార్క్‌ ఓపెన్‌, కొరియా ఓపెన్‌, చైనా ఓపెన్‌లలో తొలి రౌండ్లలోనే నిష్క్రమించింది.

PHOTOS: మరీ ఇంత హాట్‌గానా! కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోన్న అనుష్క

ఇక, మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో ప్రణవ్‌- సిక్కిరెడ్డి 14-21, 14-21తో వాంగ్‌- చెంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో సుమీత్‌రెడ్డి- మను అత్రి 23-21, 21-19తో ఆరోన్‌- సో వూ (మలేసియా) చేతిలో ఓడిపోయారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here