చైనా కంపెనీ ‘ఫోసన్’ చేతికి.. ‘థామస్ కుక్’!

0
2


చైనా కంపెనీ ‘ఫోసన్’ చేతికి.. ‘థామస్ కుక్’!

థామస్ కుక్.. గుర్తుంది కదా? ఆర్థికంగా చతికిలపడి ఈ మద్యనే ఈ బ్రిటీష్ ట్రావెల్ గ్రూప్ దివాలా తీసిన సంగతి తెలిసిందే. పాపం.. ఈ కంపెనీ దివాలా తీసే నాటికి 1.4 లక్షల మంది బ్రిటీష్ పర్యాటకులు వివిధ దేశాల్లో విదేశీ పర్యటనల్లో ఉన్నారు. వారందరినీ బ్రిటీష్ ప్రభుత్వమే తన సొంత విమానాల్లో స్వదేశానికి చేర్చింది.

ఇప్పుడు ఈ గతమంతా ఎందుకంటే.. దివాలా తీసిన ‘థామస్ కుక్’ను చైనా కంపెనీ ఫోసన్ చేజిక్కించుకుంది. ఈ కంపెనీకి థామస్ కుక్‌లో మెజారిటీ వాటా కూడా ఉంది. థామస్ కుక్‌ను దివాలా పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు అప్పట్లో ఈ కంపెనీ ప్రయత్నం కూడా చేసింది. కానీ కాలం కలిసిరాక థామస్ కుక్ మూతబడింది.

థామస్ కుక్ దివాలా ఎందుకంటే…

1840లో విక్టోరియా మహారాణి కాలం నాటి పారిశ్రమిక వేత్త ఒకరు థామస్ కుక్‌ను ప్రారంభించారు. కొన్నాళ్లు బ్రిటీష్ రైల్వేతో కలిసి పనిచేసిన ఈ సంస్థ ఆ తరువాత ఫారిన్ టూర్లు మొదలుపెట్టింది. ఏమైతేనేం.. 178 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్‌ కుక్‌ చివరికి దివాలా స్థితికి చేరింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. పర్యాటక రంగంలో ఇతర సంస్థల నుంచి విపరీతమైన పోటీ ఎదురవడం, ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు లభించకపోవడం, పర్యాటకానికి అంత్యంత అనుకూలమైన టర్కీ వంటి దేశాల్లో రాజకీయ అస్థిరత ఏర్పడడం, సమ్మర్ హాలీడే బుకింగ్స్‌లో తీవ్ర జాప్యం, బ్రెగ్జిట్ అనిశ్చితి.. ఇలా వరుస పరిస్థితుల కారణంగా సంస్థకు నష్టాలు మరింత పెరిగాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో థామస్ కుక్ దివాలాను ప్రకటించింది.

మెజారిటీ వాటా ‘ఫోసన్‌'దే...

మెజారిటీ వాటా ‘ఫోసన్‌’దే…

హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే ‘ఫోసన్‌’కు థామస్ కుక్‌లో మెజారిటీ వాటా ఉంది. అలాగే ఫ్రాన్స్‌లోని రిసార్ట్ కంపెనీ ‘క్లబ్ మెడ్’ కూడా దీని యాజమాన్యంలోనే నడుస్తోంది. దివాలా తీయబోయే ముందు థామస్ కుక్ యాజమాన్యం.. సంస్థ మనుగడ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. 900 మిలియన్ డాలర్ల అప్పు కావాలంటూ తన సంస్థలో మెజారిటీ వాటా ఉన్న ఫోసన్‌కు కూడా అడిగింది. అయితే అంత ఇవ్వలేనని, 450 మిలియన్ డాలర్లు మాత్రం ఇవ్వగలమని, మిగతా సగం ఇతర రుణదాతల నుంచి తెచ్చుకోవాలని ఫోసన్ కంపెనీ సూచించింది. కానీ మరో చోట అప్పు పుట్టకపోవడంతో థామస్ కుక్ చేసేదిలేక దివాలా పిటిషన్ దాఖలు చేసింది.

రూ.100 కోట్లు చెల్లించి...

రూ.100 కోట్లు చెల్లించి…

థామస్ కుక్‌ను.. ఫోసన్ చేజిక్కించుకున్నప్పటికీ విదేశాల్లో థామస్‌ కుక్‌కు చెందిన ఆస్తులను మాత్రం ఈ కంపెనీ కొనలేదు. కేవలం థామస్‌ కుక్ కంపెనీకి చెందిన హోటల్ బ్రాండ్స్.. అంటే ట్రేడ్ మార్కులు, డొమైన్ నేమ్స్, సోషల్ మీడియా ఖాతాలు, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు తదితరాలను మాత్రమే ఫోసన్ కొనుగోలు చేసింది. దీని కోసం 14.2 మిలియన్ డాలర్లు.. అంటే మన డబ్బులో దాదాపు రూ.100 కోట్లు వెచ్చించింది. ఫలితంగా ఇకనుంచి థామస్‌ కుక్‌తోపాటు సబ్సిడరీ హోటల్ చెయిన్లు అయిన కాసా కుక్, కుక్స్ క్లబ్.. ఫోసన్ కంపెనీ అధీనంలో ఉంటాయి.

లిక్విడేషన్‌లో ఇతరత్రా ఆస్తులు...

లిక్విడేషన్‌లో ఇతరత్రా ఆస్తులు…

థామస్ కుక్ దివాలాతో ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థలో పనిచేస్తోన్న వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. మరోవైపు సంస్థకు చెందిన ఆస్తుల లిక్విడేషన్ కొనసాగుతోంది. ప్రాపర్టీ టైకూన్, బిలియనీర్ అయిన పీటర్ స్టార్డలేన్‌కు చెందిన గ్రూప్ థామస్ కుక్‌కు చెందిన వింగ్ గ్రూప్‌ను కొనేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వింగ్స్ గ్రూప్‌లో థామస్ కుక్‌కు చెందిన స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌, గ్లోబ్ ట్రాటర్, స్పైస్ తదితర బ్రాండ్లు ఉన్నాయి. బహుశా అన్నీ అనుకూలిస్తే ఈ వారంలో ఈ కొనుగోలు పూర్తయ్యే అవకాశాలున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here