చైనా కరెన్సీ మానిప్యులేటింగ్, అమెరికా ప్రకటన: ధీటుగా బీజింగ్

0
0


చైనా కరెన్సీ మానిప్యులేటింగ్, అమెరికా ప్రకటన: ధీటుగా బీజింగ్

బీజింగ్/వాషింగ్టన్: అమెరికా – చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఇప్పుడు కరెన్సీ యుద్ధం వరకు దారి తీసింది. చైనా పెద్ద కరెన్సీ మానిప్యులేటర్ అని వాషింగ్టన్ ముద్రవేసింది. ఈ రెండు దేశాలు ఒకరిపై మరొకరు టారిఫ్‌లు పెంచుకుంటున్నారు. ఇది ట్రేడ్ వార్‌కు దారి తీసింది. ఇప్పుడు అమెరికా ట్రెజరీ విభాగం చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెన్సీ విలువను అవసరానికి తగ్గట్లుగా మార్చే దేశంగా బీజింగ్ పైన ముద్రవేసింది. ఈ రెండు అగ్రవాణిజ్య దేశాల మధ్య అఘాతం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుందని అంతర్జాతీయ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి.

2 శాతం కోల్పోయిన చైనా కరెన్సీ

చైనా కరెన్సీ విలువ దాదాపు 2 శాతం కోల్పోయింది. హాంగ్‌కాంగ్‌లో డాలర్ విలువ 7.1087 యువాన్లకు చేరుకుంది. ఆగస్ట్ 2015 తర్వాత ఒకేరోజులో ఇంత వ్యాల్యూ కోల్పోవడం ఇదే మొదటిసారి. బీజింగ్ యువాన్ విలువను తగ్గించినట్లు వార్తలు రావడంతో కరెన్సీ మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. చైనాలో కూడా యువాన్ ఇలాగే కోల్పోయింది.

ట్రంప్ హెచ్చరిక

ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సోమవారం మండిపడ్డారు. చరిత్రలోనే తొలిసారి అతి తక్కువ విలువకు చైనా కరెన్సీ చేరిందని, ఇది కరెన్సీ గారడీ అన్నారు. ఫెడ్ ఇది వింటున్నావా… ఇది అతిపెద్ద ఉల్లంఘన, భవిష్యత్తులో చైనాను ఇదే బలహీనపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిలియన్లకొద్దీ డాలర్ల అమెరికా సొమ్మును చైనా తీసుకుంటోందని, అమెరికా వ్యాపార అవకాశాల్ని, ఇండస్ట్రీని లాక్కోవడానికి బీజింగ్ తరుచూ కరెన్సీ విలువను మార్చేస్తోందన్నాడు. తమ ఉద్యోగ అవకాశాలు, వేతనాలను దెబ్బతీస్తోందని, తమ వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు నష్టం చేస్తోందన్నాడు. ఇక ఇలాంటివి కుదరదని హెచ్చరించాడు.

ధీటుగా స్పందించిన చైనా

ధీటుగా స్పందించిన చైనా

యువాన్ విలువ తగ్గడం, జిమ్మిక్కులు అంటూ అమెరికా ఆరోపించడంపై చైనా ధీటుగా స్పందించింది. చైనాకు వ్యతిరేకంగా ఏకపక్ష ధోరణి, వ్యాపార రక్షణాత్మక విధానాలు, సరికొత్త టారీఫ్స్ విధించే అవకాశలుండటటంతో ఈ తరుగుదల చోటు చేసుకుందని, అంతే తప్ప విలువను తగ్గించడంలో పోటీ పడటం లేదని చైనా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ తెలిపారు. మరవైపు, ఆగస్ట్ 3వ తేదీ తర్వాత కొనుగోలు చేసే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ విధించే అవకాశముందని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here