చోరీ కేసులను ఛేదించిన పోలీసులు

0
2


చోరీ కేసులను ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ విజయ్‌కుమార్‌, పక్కన ఎస్సై రాఘవేందర్‌

నందిపేట్‌, న్యూస్‌టుడే: నందిపేట్‌ మండలం ఖుదావంద్‌పూర్‌, ఇతర గ్రామాల్లో గత కొంత కాలం క్రితం జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌ నందిపేట్‌ ఠాణాలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న పోలీసులు నందిపేట్‌ పరిధిలోని పల్గుట్ట సమీపంలో వహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్మూర్‌కు చెందిన దాసరి అనిల్‌, అంకాపూర్‌కు చెందిన నషీద్‌ ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తూ కనిపించారు. ఈ మేరకు ఎస్సై రాఘవేందర్‌ వారిని ఆపి విచారించగా నేరాలు భయటపడ్డాయి. నందిపేట్‌ మండలం ఖుదావంద్‌పూర్‌, ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామాల్లో చోరీలకు పాల్పడినట్లు తేలింది. అంతకుముందు చేసిన నేరాలను సైతం ఒప్పుకున్నారు. వీరి నుంచి తులంన్నర బంగారు గొలుసు, తులంన్నర కాసుల పేరు, తులం బుట్టలు, నాలుగు రింగులు, సెల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. విలేకర్ల సమావేశంలో ఎస్సై రాఘవేందర్‌, కానిస్టేబుల్‌ విఘ్నేష్‌ ఉన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here