ఛలో హైదరాబాద్‌ గోడప్రతుల ఆవిష్కరణ

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్‌ పోస్టర్లను పిడిఎస్‌యు నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎస్‌. ప్రశాంత్‌ మాట్లాడుతూ ఈనెల 26న పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ చలో ప్రగతి భవన్‌ (హైదరాబాద్‌) కు పిలుపునివ్వడం జరిగిందని, విద్యార్థి లోకం జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనకు జీవోను తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ చర్య పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరంచేసే కుట్రలో భాగమన్నారు. ఇప్పటికే పాఠశాల విద్య, కళాశాల విద్య ప్రైవేటు కోరల్లో చిక్కుకుందన్నారు. ఇప్పుడు యూనివర్సిటీ విద్యను కూడా ప్రైవేటు పరం చేద్దామని కేసీఆర్‌ సర్కార్‌ కుట్ర పన్నిందన్నారు. ఇది ప్రభుత్వ యూనివర్సిటీల అస్తిత్వాన్ని దెబ్బతీయడమే అన్నారు. చివరకు ప్రభుత్వ యూనివర్సిటీలన్నీ మూసివేతకు గురవుతాయన్నారు. అంతిమంగా పేద, మధ్యతరగతి, గిరిజన, దళిత మైనార్టీ విద్యార్థుల ఉన్నత విద్య ఆశయాలను దూరం చేయడమేనన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు కావన్నారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు పని చేయవన్నారు. ప్రైవేటు యాజమాన్యాల పెత్తనమే నడుస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. నిధులలేమి, ఇతర అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ యూనివర్సిటీలను ఆదుకొని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటిని నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రైవేటు యూనివర్సిటీలు జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here