ఛాంపియన్‌ అని కాదు నీ అసలైన పేరు పెట్టుకో: బ్రావోకు కామెంటేటర్

0
0


హైదరాబాద్: వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావోపై న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ సైమన్‌ డౌల్‌ మండిపడ్డాడు. ప్రస్తుతం కెనడా వేదికగా జరుగుతున్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో డ్వేన్ బ్రావో విన్నీపెగ్‌ హాక్స్‌ జట్టుకు ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా సోమవారం టొరంటో నేషనల్స్‌, విన్నీపెగ్‌ హాక్స్‌ జట్లు తలపడ్డాయి.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో జెర్సీ 47 ఛాంపియన్‌ అని రాసి ఉన్న జెర్సీని ధరించాడు. దీనిని గమనించిన కామెంటేటర్ సైమన్ డౌల్… బ్రావోపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జెర్సీపై ఛాంపియన్‌ అని పేర్కొనడం తనకు నచ్చలేదని అన్నాడు. ఈ సందర్భంగా డౌల్ మాట్లాడుతూ “ఇది చెప్పడానికి బాగోలేకున్నా నాకు నచ్చలేదు కాబట్టి చెప్తున్నా. ఛాంపియన్‌ అని కాకుండా నీ అసలైన పేరు పెట్టుకో” అని చెప్పాడు.

“మ్యాచ్‌ వీక్షించే చిన్నపిల్లలు, పెద్దవాళ్లు నిన్ను గుర్తుపట్టాలి. నువ్వు ఛాంపియన్‌ కాదు డ్వేన్‌ బ్రావో” అని అన్నాడు. దీనిపై ట్విటర్‌లో కొందరు డౌల్‌కు మద్దతు తెలపగా మరికొందరు బ్రావోకి అండగా నిలిచారు. 2016లో బ్రావో ఛాంపియన్‌ పేరిట ఓ పాటని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే అతడు జెర్సీపై ఛాంపియన్‌ అని ముద్రించి ఉంటాడని అతడి అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, టొరంటో నేషనల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో బ్యాటింగ్‌తో ఆకట్టుకోకపోయినా బౌలింగ్‌లో రాణించాడు. బ్యాట్‌తో తొమ్మిది పరుగులే చేసిన అతడు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసి విన్నీపెగ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here