జగన్.. అంత భయమెందుకు, ‘సాక్షి’ని మూసేసుకోండి: పవన్ ఫ్యాన్స్ ఫైర్

0
0


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘సాక్షి’ పత్రికపై విరుచుకుపడుతున్నారు. ఆ పత్రికా సంస్థకు యజమాని అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంతకీ పవన్ ఫ్యాన్స్‌కు, జనసైనికులకు ఆగ్రహం తెప్పించేంత పని ‘సాక్షి’ పత్రిక ఏం చేసింది? అక్కడికే వస్తున్నా..!!

ప్రముఖ రచయిత, జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి ‘‘మన సినిమాలు: అనుభవాలు – చరిత్ర – పరిణామం’’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయితలు తనికెళ్ల భరణి, సుద్ధాల అశోక్ తేజ, పరుచూరి గోపాలకృష్ణ, రావి కొండలరావు పాల్గొన్నారు. ఈ వార్తను ‘సాక్షి’ దినపత్రిక కవర్ చేసింది.

సినిమాకు సంబంధించిన పుస్తకావిష్కరణ కావడంతో ‘సాక్షి’ సినిమా పేజీలో ప్రచురించారు. అయితే, పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ ఫొటో లేకుండా వార్తను ప్రచురించారు. వార్తలో ఒక చోట ‘‘పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు’’ అని రాశారు. శీర్షికగా మాత్రం తెలకపల్లి రవి మాటను తీసుకున్నారు. అసలు ఈ వార్తలోకి వెళ్లకుండా ఫొటో, శీర్షిక మాత్రం చూస్తే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారనే విషయమే తెలీదు. ఈ అంశమే పవన్ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

సోషల్ మీడియా ద్వారా పవన్ ఫ్యాన్స్ ‘సాక్షి’ పేపర్‌పై, దాని యజమాని వై.ఎస్.జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కేవలం ఒక్క సీటు గెలిచిన పవన్ కళ్యాణ్‌కు 151 సీట్లు గెలిచిన జగన్ ఎందుకింత భయపడుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతలా భయపడితే ‘సాక్షి’ పేపర్‌ను మూసేసుకోండి అంటూ సలహాలిస్తున్నారు. పక్షపాతంతో వార్తలు రాయొద్దంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబును, టీడీపీని తిట్టడం.. వైఎస్సార్‌సీపీని, జగన్‌మోహన్‌రెడ్డిని ఆకాశానికి ఎత్తడం తప్ప ‘సాక్షి’ పత్రికలో ఏముందంటూ తిట్టిపోస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here