జగన్ ఎందుకు వదులుతారు : పోర్టు ఒప్పందం రద్దు వెనుక అసలు కారణం: కేసీఆర్ తో సైతం ..!!

0
0


జగన్ ఎందుకు వదులుతారు : పోర్టు ఒప్పందం రద్దు వెనుక అసలు కారణం: కేసీఆర్ తో సైతం ..!!

ఏపీలో అధికారంలో ఉన్నది జగన్. తనకు జరిగిన అవమానాలతోనే కసిగా ఎదిగి..సీఎం అయ్యారు. దీంతో..ఆయన తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఉంటుంది. తాజాగా బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనుల్లో జాప్యమే కారణమని అందులో పేర్కొంది. అయితే, ఆ పనులు దక్కించుకున్నది..ప్రారంభించేందుకు సిద్దమైన సంస్థ నవయుగ. కొద్ది రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు పనుల నుండి తప్పుకోవాలంటూ నవయుగ సంస్థకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అనే నవయుగకు మరో షాక్ తప్పలేదు. అయితే, ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం వెనుక అసలు విషయం ఏంటనే చర్చ మొదలైంది. ఇందులో కేసీఆర్ సంబంధించిన వ్యవహారమూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

బందరు పోర్టు ఒప్పందం రద్దు వెనుక..

ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఒప్పందం రద్దు అయింది. బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. 2008లో తొలిగా ఈ ప్రాజెక్టు కోసం వైయస్సార్ హాయంలో మైటాస్ తో తొలి డీల్ జరిగింది. అయితే, సత్యం రామలింగ రాజు ఇబ్బందుల్లో చిక్కుకోవటం..ఆర్దికంగా స్థోమత లేకపోవటంతో వారు తప్పుకున్నారు. ఆ తరువాత మైటాస్ నుండి కొందరు తప్పు కోవటంతో నవయుగ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఇతర కంపెనీలు సైతం వీరితో కలవటానికి ఆసక్తి చూపాయి. అయినా..అప్పటి నుండి వారు పనులు ముందుకు తీసుకెళ్ల లేకపోయారు. అదే సమయంలో టీడీపీ ఏపీలో అధికారంలోకి రావటం..నవయుగకు ప్రాధాన్యత ఇవ్వటం మొదలైంది. పోలవరం కాంట్రాక్టు విషయంలో అసలు కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ పనులు చేయలేక పోవటంతో నవయుగకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక, ఇప్పుడు నవయుగ తో ప్రభుత్వ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు. దీని పైన ఇప్పుడు బీజేపీ..టీడీపీ రెండు పార్టీల నేతలు మండిపడుతున్నారు.

టార్గెట్ నవయుగ.. అదేనా కారణం

టార్గెట్ నవయుగ.. అదేనా కారణం

నవయుగ సంస్థ ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రధాన ప్రాజెక్టులు దక్కించుకుంటోంది. తాజాగా పోలవరం నుండి ఇప్పుడు బందరు పోర్టు పనుల నుండి నవయుగను తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వమే పీపీపీ విధానంలో బందరు పోర్టు నిర్మాణం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, నవయుగ సంస్థతో జగన్ పదే పదే ప్రస్తావించే ఆ రెండు పత్రికల అధిపతులతో నవయుగకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక ప్రధాన పత్రిక అధిపతికి నవయుగతో వియ్యం ఉంది. మరో పత్రిక అధినేతతో వ్యాపార ..ఆర్ధిక సంబంధాలు ఉన్నట్లుగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా టీడీపీకి ప్రధాన ఆర్దిక మద్దతుదారుడిగా ఉన్నారని ఆ సంస్థ ఉందనేది వైసీపీ నేతల అభిప్రాయం. తన మీద తొమ్మిదేళ్ల పాటు వేధింపులు..ఆరోపణలు..పరోక్షంగా తాను శిక్ష అనుభ వించటానికి కారణమైన వారిని జగన్ అంత సులువుగా ఎలా వదులుతాడనేది ఇప్పుడు మొదలైన విశ్లేషణ. అందులో భాగంగా టీడీపీ కీలక ఆర్దిక వనరుల మూలాలను జగన్ దెబ్బ తీసే పని మొదలు పెట్టారని విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే వేల రూపాయాల కాంట్రాక్టులు అయిన పోలవరం..బందరు పోర్టు నుండి నవయుగను తప్పిస్తూ జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

కేసీఆర్ ప్రమేయానికి సమాధానంగా..

కేసీఆర్ ప్రమేయానికి సమాధానంగా..

తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ఎన్నికల్లో జగన్ కు సహకారం అందించారని..దాని ప్రతిఫలంగా బందరు పోర్టు ఇస్తున్నారంటూ టీడీపీ అధినేత మొదలు అనేక మంది పార్టీ నేతలు ఆరోపించారు. జీవో సైతం ఇచ్చారని..ఆ తరువాత ఉపసంహరించుకున్నారని ప్రచారం చేసారు. అయితే, అసలు పోర్టు ఒప్పందమే రద్దు చేయటం ద్వారా తన పైన ఆరోపణలు చేసిన వారికి షాక్ ఇవ్వాలనేది జగన్ నిర్ణయంగా కనిపి స్తోంది. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వమే పోర్టు నిర్మాణం చేపడుతుందని చెప్పినా..తెలంగాణలో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఒక ప్రధాన నిర్మాణ సంస్థకు ఈ ప్రాజెక్టు అప్పగిస్తారనే ప్రచారమూ సాగుతోంది. అయితే, జీవో జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ..బీజేపీ నుండి వస్తున్న విమర్శలకు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here