జట్టు కోసమే కాదు.. దేశం కోసం ఆడతా: రోహిత్ శర్మ

0
0


హైదరాబాద్: కేవలం జట్టు కోసమే కాదు.. దేశం కోసం ఆడతా అని టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తెలిపారు. ప్రపంచకప్‌ సెమీస్‌ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బ్యాటింగ్ కోచ్ భరత్ అరుణ్ ‘అలాంటి ఏమీ లేదని, జట్టులో విభేదాలు సహజమే’ అని కొట్టిపారేశాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

ఎలాంటి విబేధాలు లేవు:

ఎలాంటి విబేధాలు లేవు:

తాజాగా కోహ్లీ భార్య అనుష్క శర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ అన్‌ఫాలో చేయడంతో ఈ వార్తలు నిజమే అని అందరూ అనుకున్నారు. ఇక విండీస్ పర్యటనకు వెళ్లే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ… ‘రోహిత్‌కు నాకు మధ్య విభేదాలు పూర్తిగా నిరాధారం. అనవసరంగా వ్యక్తిగత జీవితాలను వివాదాల్లోకి లాగుతున్నారు. బయట ఉన్నవాళ్లు లేని వార్తలు పుట్టిస్తుంటే అసహ్యమేస్తోంది’ అని స్పష్టం చేసాడు.

జట్టులో ఎవరు గొప్ప కాదు:

జట్టులో ఎవరు గొప్ప కాదు:

రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మల మధ్య విభేదాలు అబద్ధాలు. ఈ వార్తలు ఎవరు సృష్టించారో అర్ధం కావట్లేదు. ఇలాంటి విషయాలు చదవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆటకన్నా జట్టులో ఎవరు గొప్ప కాదు. ఎవరైనా జట్టు కోసమే ఆలోచించేవాళ్లే’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

దేశం కోసం బరిలోకి దిగుతా:

విబేధాల అంశంపై ఇంతవరకు మాట్లాడని రోహిత్ శర్మ బుధవారం ఓ ట్వీట్ చేసాడు. ‘జట్టు కోసం మాత్రమే కాదు.. దేశం కోసం బరిలోకి దిగుతా’ అని రాసుకొచ్చాడు. అంతేకాదు తాను బ్యాటింగ్‌కు వస్తున్న ఓ ఫొటోను పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. కోహ్లీ, రవిశాస్త్రి వ్యాఖ్యలకు కౌంటర్‌గా రోహిత్‌ పంచ్‌ ఇచ్చాడని నెటిజన్లు భావిస్తున్నారు. వివాదంపై కోహ్లీ, రవిశాస్త్రి తప్ప మరెవరూ మాట్లాడని నేపథ్యంలో ఈ ట్వీట్ మరిన్ని వాదనలకు దారి తీసే అవకాశం ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here