జడ్జికి భార్య బికినీ ఫొటోలను చూపించిన భర్త.. కోర్టు కీలక నిర్ణయం!

0
1


ర్తతో విడాకులు తీసుకున్న భార్యకు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. పిల్లలను పెంచే అర్హత ఆమెకు లేదని, వారు భర్త వద్దే ఉండాలని తీర్పు ఇచ్చింది. ఇందుకు ప్రధాన కారణం.. ఆమె బికినీ వేసుకోవడమే. ‘రయోట్.ఆర్గ్’లో ప్రచురితమైన కథనం ప్రకారం.. కొవైట్‌కు చెందిన ఓ జంట ఇటీవలే విడాకులు తీసుకుంది. అయితే, పిల్లలు ఎవరికి చెందాలనే విషయంపై గందరగోళం ఏర్పడింది.

ఈ సందర్భంగా భర్త న్యాయమూర్తికి కొన్ని ఫొటోలను చూపించాడు. వాటిలో అతడి భార్య వేరే దేశంలో పిల్లలతో కలిసి బికినీలో కనిపించింది. ఆ ఫొటోలో మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆమె లైఫ్‌స్టైల్ పిల్లల సంరక్షణకు సరైనది కాదని, ఇందుకు ఆమె అనర్హురాలని భర్త తరఫు న్యాయవాది జడ్జికి తెలిపాడు. న్యాయమూర్తి కూడా దీన్ని అంగీకరిస్తూ పిల్లలు ఆమె భర్త వద్ద ఉండటమే సురక్షితమని తెలిపారు.

ఈ తీర్పుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దుస్తులు వేసుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని, దీనిపై అంక్షలు విధించడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, కువైట్ వంటి దేశాలు వస్త్రధారణ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. సాంప్రదాయాలను గౌరవించేలా వస్త్రధారణ ఉండాలని, భవిష్యత్తు తరాలు కూడా వాటిని అనుసరించాలని అక్కడి చట్టాలు తెలుపుతున్నాయి. వీటికి లోబడే కోర్టు ఈ తీర్పు ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here