జనసేన ఎమ్మెల్యేకు ఒక న్యాయం..వైసీపీ ఎమ్మెల్యేకు ఒక న్యాయమా? అంటోన్న పవన్ వ్యాఖ్యాలను సమర్థిస్తారా?

0
4


జనసేన ఎమ్మెల్యేకు ఒక న్యాయం..వైసీపీ ఎమ్మెల్యేకు ఒక న్యాయమా? అంటోన్న పవన్ వ్యాఖ్యాలను సమర్థిస్తారా?

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై ప్రభుత్వం వివక్షత చూపుతోందని పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇస్తే.. సమసి పోయే ఈ వివాదాన్ని నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసేంత వరకూ తీసుకెళ్లిందని ఆరోపించారు. అదే సమయంలో- నెల్లూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ సీనియర్ జర్నలిస్టును కొట్టినా, బెదిరించినా ఆయనపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

జనసేన పార్టీ ఎమ్మెల్యేకు ఒక న్యాయం, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు ఒక న్యాయమా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చట్టం, న్యాయం అనేది అందరికీ సమానమేనని, తమ పార్టీ ఎమ్మెల్యే మీద ఎందుకు వివక్షత చూపుతున్నారని నిలదీశారు. అధికారంలో కూర్చుంటే చట్టాలు చుట్టాలుగా మారతాయా? అని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్టు చేయడానికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ను జారీ చేసినట్టే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు కోసం కూడా వారెంట్ ను జారీ చేయాలని డిమాండ్ చేశారు. జనసేన ఎమ్మెల్యేకు ఒక న్యాయం..వైసీపీ ఎమ్మెల్యేకు ఒక న్యాయమా? అంటోన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యాలను సమర్థిస్తారా? మీ వ్యాఖ్యలను కామెంట్ల ద్వారా తెలియజేయండి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here