జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వ చర్యలను సమర్థించిన సుప్రిం కోర్టు… పిటిషన్ విచారణ వాయిదా,

0
0


జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వ చర్యలను సమర్థించిన సుప్రిం కోర్టు… పిటిషన్ విచారణ వాయిదా,

జమ్ము కశ్మీర్‌లో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కశ్మీర్‌లో సాధరణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని సుప్రిం కోర్టు పిటిషనర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న నిర్భంధంతోటు కనీసం ప్రజాప్రతినిధులను కూడ రాష్ట్రంలో అడుగుపెట్టనీయక పోవడంపై సుప్రిం కోర్టులో పిల్ దాఖలైన పిటిషన్‌ను విచారించేందు న్యాయమూర్తుల బృందం నిరాకరించింది.

జమ్ము కశ్మీర్‌ రాష్ట్రం భద్రతాదళాల నడుమ ఉండడంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని, దీంతోపాటు రాజకీయ నాయకులను కూడ భద్రతా దళాలు అనుమతించకపోవడంపై సుప్రిం కోర్టులో కాంగ్రెస్ నేత తెహసీన్ పూనావాలా పిల్ ధాఖలు చేశారు.. దింతో పిటిషన్‌పై అటార్ని జనరల్ కేకే వేణగోపాల్ వాదనలు వినిపించారు. 2016లో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాణి ఎన్‌కౌంటర్ తర్వాత అక్కడి స్థానికులను రెచ్చగోట్టడడం ద్వార సుమారు 44 మంది చనిపోయారని, అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే భద్రతా దళాల మోహరింపు,రాజకీయ నాయకుల అనుమతి ఇవ్వడం లేదని వేణుగోపాల్ సుప్రిం కోర్టుకు వివరించాడు.

ఈ నేపథ్యంలోనే 2016 జరిగిన సంఘటను పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాయని వివరించారు. రాజకీయ నాయకులు రెచ్చగోట్టే సాక్ష్యాలు కూడ ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఆయన పేర్కోన్నారు. కాగా స్థానిక శాంతి భద్రత సమస్యలపై రోజువారి సమీక్ష జరుపుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిబంధనలను సడలిస్తున్నామని వివరించారు. దీంతో స్పందించిన న్యాయమూర్తుల బృందం కేసును తక్షణమే విచారించేందుకు నిరాకరించింది. ప్రస్థుత పరిస్థితిపై ఎలాంటీ ఆదేశాలు ఇవ్వలేమని పేర్కోంది. శాంతి భద్రతల సమస్యను తలెత్తకుండా చూసుకోవడం అధికారుల భాద్యతగా పేర్కోంది..దీంతో రెండు వారల అనంతరం కేసును విచారిస్తామని తెలిపింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here