జమ్ము కాశ్మీర్ లో మరో కీలక ఘట్టం: కేంద్రం వడివడిగా అడుగులు: అక్టోబర్ లో అంతా అక్కడే..!!

0
2


జమ్ము కాశ్మీర్ లో మరో కీలక ఘట్టం: కేంద్రం వడివడిగా అడుగులు: అక్టోబర్ లో అంతా అక్కడే..!!

జమ్ము కాశ్మీర్ పైన కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆకస్మికంగా జమ్ము కాశ్మీర్ లో అధికరణ 370, అధికరణ 35ఏలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ జమ్ము కాశ్మీర్ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఒక వైపు అక్కడ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న సమయంలోనే కేంద్రం అక్కడ

అభివృద్ధికి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. అక్టోబరు 12 నుంచి 14 వరకు పెట్టుబడిదారుల సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. జమ్మూ-కశ్మీరులో జరిగే మొట్టమొదటి ప్రపంచ స్థాయి సదస్సు ఇదే కానుంది. కేంద్రం ప్రతిష్ఠాత్మకం నిర్వహించనున్న ఈ సదస్సు ద్వారా కేంద్రం అక్కడ పూర్తిగా పరిస్థితిని తమ కంట్రోల్ లోకి తెచ్చుకోనుంది.

జమ్ము కాశ్మీర్ లో పెట్టుబడిదారుల సదస్సు..

జమ్మూ-కశ్మీరు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం అంటూ ఆర్టికల్ 370.. అధికరణ 35ఏలను రద్దు చేసిన కొద్ది రోజులకే అభివృద్ధి దిశగా చర్యలు మొదలు పెట్టింది. తాము తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా చెప్పుకుంటున్న ప్రధాని మోదీ అండ్ టీం..ఇప్పుడు అక్కడ తమ నిర్ణయం ద్వారా మొదలవుతున్న డెవలప్ మెంట్ తమ ఖాతాలో జమ అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఒక వైపు జమ్ము కాశ్మీర్ లో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అక్కడ డీలిమిటేషన్ తో పాటుగా ఎన్నికల నిర్వహణ మీద తొలి సమావేశం జరిగింది. ఇదే సమయంలో జమ్ము కాశ్మీర్ ప్రజలను ..ముఖ్యంగా అక్కడ యువతను ఆకట్టుకొనే రీతిలో తాజాగా కీలక ప్రకటన చేసింది. తాము తీసుకున్న నిర్ణయం ద్వారా జమ్ము కాశ్మీర్ తల రాత మారబోతోందంటూ ప్రధాని చెప్పిన కొద్ది రోజులకే తీసుకున్న తాజా నిర్ణయం మోదీ పైన విశ్వాసం పెంచేలా ఉంది. ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండా అక్కడ పెట్టుబడులు పెట్టే వారితో అదే రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని ద్వారా ముందుగా అక్కడ ఉపాధి అవకాశాల మీద నమ్మకం కలిగించలమే కేంద్ర తక్షణ ఆలోచనగా కనిపిస్తోంది.

అక్టోబర్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు..

అక్టోబర్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు..

జమ్మూ-కశ్మీరులో ఇప్పటి వరకు అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. ఇక, ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలిగి పోవటంతో అక్కడ అంతర్జాతీయ స్థాయి లో పెట్టుబడి దారుల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో జరిగే తొలి సదస్సు సైతం ఇదే. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న అంతర్జాతీయ పెట్టుబడి దారుల సదస్సు అక్టోబర్ 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనుంది. శ్రీనగర్ లో ఈ సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జమ్మూ-కశ్మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ (కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఎన్ కే చౌదరి వెల్లడించారు. జమ్మూ-కశ్మీరు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యటక రంగం వాటా 15 శాతం గా ఉందని… ఈ రంగంలో 50 శాతం ఉద్యోగావకశాలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పెట్టుబడిదారుల సదస్సులో పర్యటక రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు పర్యాటక రంగంవైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.

స్థానికంగా ఆ రంగాలకు ప్రాధాన్యత..

స్థానికంగా ఆ రంగాలకు ప్రాధాన్యత..

అధికరణ 370 రద్దవడంతో పారిశ్రామికవేత్తలు జమ్మూ-కశ్మీరులో పర్యటకం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారని అధికారులు ఆశిస్తున్నారు. ప్రకృతి సోయగాల నడుమ ఇళ్ళను నిర్మించుకోవడంపై చాలా మందికి ఆసక్తి ఉంటుందని..ఇది ఇప్పుడు అక్కడ తీసుకున్న తాజా నిర్ణయాల ద్వారా కొత్త పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ-కశ్మీరులో రియల్ ఎస్టేట్ ధరలు మిగతా దేశంతో పోల్చినపుడు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో మరోవైపు ఇక్కడి సెంటిమెంట్ ఇప్పుడే చల్లారే అవకాశం లేదనేవారు కూడా ఉన్నారు. జమ్మూ-కశ్మీరు అభివృద్ధి బాట పట్టేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు మరికొంత సమయం పడుతుందని వీరు చెప్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారులకు ..వారి పెట్టుబడులకు పూర్తి భరోసా ఇవ్వటం ద్వారా జమ్ము కాశ్మీర్ లో కొత్త ప్రపంచం ఆవిష్కరించటానికి ప్రయత్నాలు చేస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here