జయంతి అధికారికంగా నిర్వహించాలి

0
1


జయంతి అధికారికంగా నిర్వహించాలి

బోధన్‌లో నివాళులర్పిస్తున్న రజక సంఘం నాయకులు

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని రజక సంఘం నియోజకవర్గ బాధ్యుడు వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. అంబేడ్కర్‌చౌరస్తాలో ఐలమ్మ జయంతిని గురువారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి గోశాల అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శంకర్‌, నాగయ్య, విజయ్‌, గంగాధర్‌, బాబు, సుధాకర్‌, రమేష్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎడపల్లి, రెంజల్‌, నవీపేట, బోధన్‌ గ్రామీణం: ఎడపల్లి, రెంజల్‌, నవీపేట, సాలూరలో గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, రమేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌, నారాయణ, దేవీదాస్‌, బాలయ్య, జగన్‌, గంగాధర్‌, మల్లేశ్‌, రాంరెడ్డి, రవి, అశోక్‌, సాయిలు, రాజశేఖర్‌, బోజన్న, భరత్‌, ప్రసాద్‌, లావణ్య, రేఖ పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here