జయశంకర్‌ ఆదర్శాలను యువత పాటించాలి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ చూపించిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ఆదర్శాలను యువత పాటించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జయశంకర్‌ 86వ జయంతి వేడుకలను కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేత ఆధ్వర్యంలో మంగళవారం జనహితతలో ఘనంగా జరిపారు. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. జయశంకర్‌ భావాల నుంచి ఉద్భవించిన తెలంగాణ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలైన హరితహారం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం తదితర పథకాల ద్వారా ప్రజలకు వివిధ సేవలు అందించడంలో ముందంజలో ఉందన్నారు. ఎస్‌పి శ్వేత మాట్లాడుతూ జయశంకర్‌ తెలంగాణ కోసం ఎంతగానో శ్రమించారన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సాంస్కృతిక కళా బృందం తమ పాటల ద్వారా జయశంకర్‌ జీవిత చరిత్రను వివరించారు. సమావేశంలో ఆర్డీవో రాజేందర్‌, సిపివో శ్రీనివాస్‌, జడ్పి సిఇవో కాంతమ్మ, ఏవో పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here