జయశంకర్‌ సార్‌ మార్గదర్శనంలో వెళ్లడమే అసలైన నివాళి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ చూపిన మార్గంలో వెళ్ళడమే ఆయనకు సరైన నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ 85వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కంఠేశ్వర్‌ వద్దగల ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అత్యంత గౌరవం ఉండేదని, ఆయన చూపిన బాటలోనే తెలంగాణ సాధించారని తెలిపారు. రాష్ట్ర సాధన అనంతరం బంగారు తెలంగాణ సాధించే దిశగా ముందుకు వెళుతుందని ఆయన చూపిన మార్గంలో మన మంతా కూడా నిబద్ధతతో ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ తెలిపారు. తెలంగాణ రావాలని అహరహం ఆయన తపించారని, తెలంగాణ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఆయన నడిచిన బాటలో, ఆయన చూపిన మార్గంలో వెళ్లడమే మన ముందున్న కర్తవ్యం అని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇందుకై నిబద్ధతతో పనిచేయాలని ఆయన కోరారు. కేవలం పుట్టిన రోజులు జరపడం కాకుండా ఆయన కోరుకున్న మార్గంలో వెళ్లడమే అసలైన నివాళి అవుతుందని ఆయన అన్నారు. జిల్లాలో అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇకముందు కూడా ప్రభుత్వం నిర్దేశించే కార్యక్రమాలతోపాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అందరి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సామ్సన్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం, డి.ఎస్‌.సి.డి.ఓ. శశికళ, సిపివో రాములు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here