జర భద్రం : చిన్నారి కిడ్నాప్.. ఆపై చేతులు విరిచేసి..!

0
0


జర భద్రం : చిన్నారి కిడ్నాప్.. ఆపై చేతులు విరిచేసి..!

హైదరాబాద్‌ : కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. సడీచప్పుడు కాకుండా చాపకింది నీరులా విజృంభిస్తున్నారు. పిల్లల్ని ఎత్తుకెళుతూ అందినకాడికి అమ్ముకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కిడ్నాపర్లు రాక్షసుల్లాగా ప్రవర్తించడం భయాందోళన కలిగిస్తోంది. ఆ క్రమంలో హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఘటన కలకలం సృష్టిస్తోంది.

లంగర్‌హౌజ్ ప్రాంతంలో మూడు రోజుల కిందట వైష్ణవి అనే చిన్నారి కనిపించకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదలావుంటే తీవ్రగాయాలతో ఆ చిన్నారి తల్లిదండ్రులకు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అభం శుభం తెలియని ఆ చిన్నారి పట్ల కిడ్నాపర్ రాక్షసత్వం ప్రదర్శించాడు. అతికిరాతంగా రెండు చేతులు విరిచేసి పాపను వదిలి పారిపోయాడు.

మూడు రోజుల తర్వాత తమ చిన్నారి కనపడటంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే చిన్నారిని ఆ పరిస్థితుల్లో చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తనను ఓ పిచ్చోడు ఎత్తుకెళ్లాడని చెబుతోంది ఆ చిన్నారి. అనంతరం తీవ్రంగా కొట్టడమే గాకుండా చేతులు విరిచేశాడని తెలిపింది.

అదలావుంటే వైష్ణవికి ఉస్మానియాలో వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, సర్జరీ అవసరమా లేదంటే కట్లతోనే నయం అవుతుందా అనే విషయం పరిశీలిస్తున్నారు. అయితే ఆ చిన్నారిని ఫకీరప్ప అనే ముసలాయన కిడ్నాప్ చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here