జలసంపద కాపాడుకోవాలి

0
5నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటినుండి జల సంపదను కాపాడుకోవాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. కషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్‌ జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణంలో మంగళవారం క్షత్రియ కళాక్షేత్రంలో రైతులు రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రజా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన జలశక్తి అభియాన్‌ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్‌, నిజామాబాద్‌, మోర్తాడ్‌, ముప్కాల్‌ మండలాల్లో పడిన వర్షం నీటి కంటే ఎక్కువగా నీటి వినియోగం ఎక్కువై భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, ఆర్మూర్‌ ప్రాంతంలో 16 గ్రామాలలో 12 గ్రామాలలో పడిన వర్షపు నీటి సామర్థ్యం కంటే ఎక్కువగా వినియోగించుకున్నారని మరో 4 గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నాయని వాటిని తగ్గించడానికి ప్రతి వర్షపు నీటిబొట్టు భూమిలోకి వెళ్లే విధంగా నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రధానంగా ఐదు అంశాలను దష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నట్లు చెప్పారు. వర్షపు నీటిని పట్టుకొని భూమిలోకి ఇంకింప చేయడం, చెరువులు, కాలువలు వనరులను పునరుద్ధరణ మరమ్మతులు చేపట్టి నీటి నిల్వను పెంపొందించడం, బోరుబావులను పున ప్రారంభం, వాటర్‌ షెడ్‌ మేనేజ్‌మెంట్‌, విరివిగా చెట్లు నాటడం చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశాలలో తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, తెలంగాణ హరితహారం ద్వారా చెట్లు నాటడం అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు, పాం ఫండ్స్‌ చేపట్టడం జరిగిందని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here