జలాశయం ఖాళీ

0
3


జలాశయం ఖాళీ

వెలవెలబోతున్న నీటి వనరులు

న్యూస్‌టుడే, నిజాంసాగర్‌

జులై రెండో వారం ముగిసినా వరుణుడు కరుణించ లేదు. దట్టంగా కమ్ముకొన్న మేఘాలు మురిపిస్తున్నాయే తప్ఫ. వాన జాడ లేదు. నిజాంసాగర్‌ జలాశయంతో పాటు దీనికి అనుసంధానంగా ఉన్న సింగీతం, కల్యాణి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేక బోసిపోతున్నాయి. ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో వరినార్లు పోశారు. పొలాలు దున్నారు. ఇక భారీ వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

నిజాంసాగర్‌: దీని పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులతో 17.80 టీఎంసీలు. ప్రస్తుతం 1377.74 అడుగులతో 0.08 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. దీని కింద 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో లేదు.

సింగీతం: దీని పూర్తిస్థాయి నీటి మట్టం 416.00 మీటర్లు. వర్ని, పెద్దగుట్ట, గాంధారి ప్రాంతాల్లో నాలుగు రోజు కిందట కురిసిన వర్షాలకు కొంత మేర వరద నీరు వచ్చి చేరింది. దీని పరిధిలో రెండు వేల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. మరో రెండు, మూడు భారీ వర్షాలు కురిస్తేనే ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుంది.

కల్యాణి: దీరి పూర్తిస్థాయి నీటి మట్టం 409.00 మీటర్లు. ప్రస్తుతం నీటి నిల్వ అసలే లేదు. దీని కింద 600 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఈ జలాశయం నిండితే దీని ఆయకట్టుతోపాటు 10 వేల ఎకరాల(నిజాంసాగర్‌ ఆయకట్టు)కు సైతం నీరు అందుతుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here