జల సంరక్షణకు నడుం బిగించాలి

0
0


జల సంరక్షణకు నడుం బిగించాలి

 
కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న కామారెడ్డి జిల్లా పాలనాధికారి సత్యనారాయణ తదితరులు

మాచారెడ్డి, న్యూస్‌టుడే: జల సంరక్షణకు ప్రతిఒక్కరు నడుం బిగించాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. మాచారెడ్డి మండలం లచ్చాపేటలో సోమవారం నిర్వహించిన జలశక్తి అభియాన్‌ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెరువులు.. కుంటలు.. ఇంకుడు గుంతల ద్వారా నీటిని భూగర్భంలోకి ఇంకించాలన్నారు. కనీసం తాగేందుకు నీరు కావాలన్నా భూగర్భంలో నీరు ఉండాలనేది ప్రతిఒక్కరు గుర్తించాలన్నారు. జలశక్తి అభియాన్‌ సెప్టెంబరు వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. కిచెన్‌గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ఇంకుడు గుంత తవ్వకాన్ని చేపట్టారు. విద్యార్థులు చెట్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రదర్శించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. పాలనాధికారి విద్యార్థులకు రాత పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి, డీఈవో రాజు, ఇన్‌ఛార్జి ఎంపీడీవో లక్‌పతినాయక్‌, ఎంఈవో ఎల్లయ్య, ఉపాధిహామీ ఏపీవో రాజేందర్‌, సర్పంచి జగతి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంకుడు గుంత తవ్వుతున్న జిల్లా పాలనాధికారి, సర్పంచి తదితరులు

నీటిని నిల్వ చేసే పనులను చేపట్టాలి

దోమకొండ : నీటిని నిల్వ చేసే పనులను ప్రతిపాదించి, సత్వరమే పూర్తి చేయించాలని డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం దోమకొండ మండల పరిషత్‌లో ఉపాధిహామీ క్షేత్ర సహాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలశక్తి అభియాన్‌లో భాగంగా నీటి నిల్వ చేసే పనులకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇంకుడు గుంతలు, ఫాంపాండ్‌లు, కాంటూరు కందకాల పనులు చేపట్టాలని పేర్కొన్నారు. వర్షపు నీటిని వృథా పోనీయకుండా అదే గ్రామంలో నీటి నిల్వ చేసేలా చూడాలని చెప్పారు. సెప్టెంబరు 15 లోగా రెండు దశల్లో ఆయా పనులను పూర్తి చేయించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌గౌడ్‌, ఏపీవో అన్నపూర్ణ, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

వర్షం నీటిని సంరక్షించాలి

కామారెడ్డి కలెక్టరేట్‌ : గ్రామాల్లో వర్షం నీటిని సంరక్షించాలని పాలనాధికారి సత్యనారాయణ సూచించారు. జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జలశక్తి అభియాన్‌ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. డీఆర్‌డీఏ శాఖ చేపడుతున్న పలు పథకాల గురించి అధికారులకు వివరించారు. నీటిని సంరక్షించడానికి నోడల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులకు మోక్షం కలిగించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు.హరితహారంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here