జవాన్లపై షాకింగ్ కామెంట్స్: యువతిపై క్రిమినల్ కేసు నమోదు: వివరణ ఇచ్చుకున్న సైన్యం

0
4


జవాన్లపై షాకింగ్ కామెంట్స్: యువతిపై క్రిమినల్ కేసు నమోదు: వివరణ ఇచ్చుకున్న సైన్యం

శ్రీనగర: జమ్మూ కాశ్మీర్‌ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తరువాత ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్రానికి చెందిన ఓ యువతి చేసిన ఆరోపణలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దీనిపై ఏకంగా మనదేశ సైనికాధికారులే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ లోని అనేక ప్రాంతాల్లో ఆర్మీ జవాన్లు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రత్యేకించి ఒక వర్గం వారిని టార్గెట్ గా చేసుకుని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ నాయకురాలు షెహ్లా రషీద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్దేశపూరకంగా జవాన్లు కొంతమంది కాశ్మీరీల నివాసాలపైకి దాడులు చేస్తున్నారని విమర్శించారు.

దీనిపై ఆమె వరుసగా ట్వీట్లను సంధించారు. శ్రీనగర్ సహా పొరుగు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని ఆమె పేర్కొన్నారు. విలేకరులను ఎవ్వరినీ సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లోకి రానివ్వట్లేదని, వారిపై నిషేధం విధించారని అన్నారు. ఫలితంగా- ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో బాహ్య ప్రపంచానికి తెలియదని, దీన్ని అడ్డుగా పెట్టుకుని భారత జవాన్లు స్థానికుల ఇళ్లపైకి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేకించి రాత్రివేళల్లో దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఇళ్లల్లో ప్రవేశించి, తనిఖీల పేరుతో నిత్యావసర సరుకులను నేలపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చాలా ప్రాంతాల్లో వంటగ్యాస్ ఏజెన్సీలు మూతపడటం వల్ల కాశ్మీరీలు పొయ్యి కూడా వెలిగించుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. షోపియాన్ లో ఆర్మీ వేసిన టెంట్ లో నలుగురు స్థానికులకు చిత్రహింసలకు గురి చేశారని ఆమె విమర్శించారు.

షెహ్లా రషీద్ చేసిన ఆరోపణలపై సైన్యం తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా షెహ్లా రషీద్ ఆరోపణలు గుప్పిస్తున్నారని వివరణ ఇచ్చింది. ఆమె చేస్తోన్న ఆరోపణలు, విమర్శలు నిరాధారమైనవని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు క్రమంగా నెలకొంటున్నాయని, అయినప్పటికీ.. తమపై ఆరోపణలు చేయడం సహేతుకం కాదని సైన్యం పేర్కొంది. శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో.. అక్కడి వాతావరణాన్ని మళ్లీ కలుషితం చేయడానికి షెహ్లా రషీద్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆర్మీ వెల్లడించింది. కాగా- మనదేశ సైన్యంపై నిరాధారమైన ఆరోపణలు గుప్పించిన షెహ్లా రషీద్ పై క్రిమినల్ కేసు నమెదైంది. ప్రముఖ న్యాయవాది అలోక్‌ శ్రీవాస్తవ సుప్రీంకోర్టులో ఆమెపై క్రిమినల్‌ కేసును నమోదు చేశారు. భారత ప్రభుత్వంపై, ఆర్మీపై నిరూపణలేని ఆరోపణలు చేశారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here