జాక్రాన్‌పల్లి వాసికి దుబాయ్‌ లాటరీ

0
6నిజామాబాద్‌, ఆగష్టు 4నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పని కోసం నానా అవస్థలు పడ్డాడు… భార్యా, ఇద్దరు కూతుళ్ళతో కుటుంబ జీవనం భారంగా మారింది… పొట్ట చేత పట్టుకొని కానరాని దేశాల వెంట పని కోసం పరుగులెత్తాడు…. ఫలితం శూన్యం… నిరాశ, నిస్పృహతో స్వదేశం వచ్చాడు… లక్ష్మిదేవి అనుగ్రహించింది… ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు… వివరాల్లోకి వెళితే… జక్రాన్‌పల్లికి చెందిన విలాస్‌ రిక్కల్‌కు దుబాయ్‌, అబుదాబిలో కోటి 50 లక్షల దరమ్‌ల లాటరీ టికెట్‌ వరించింది. భారత కరెన్సీలో అవి రూ.29 కోట్లతో సమానం. దీంతో విలాస్‌ అవధుల్లేనంత ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. జక్రాన్‌పల్లికి చెందిన విలాస్‌ గత రెండేళ్ళుగా దుబాయ్‌లో ఉంటూ ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. తిరిగి దుబాయ్‌ వెళ్ళి 45 రోజుల పాటు ఉద్యోగం కోసం వెతుకుతూ విఫల ప్రయత్నం చేశాడు. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చాడు. వస్తూ వస్తూ తనవద్ద డబ్బులు లేకపోవడంతో తన భార్య పద్మ వద్ద 20 వేల రూపాయలు తీసుకొని మూడు లాటరీ టికెట్లు కొన్నాడు. అబుదాబిలో 223805 నెంబరుగల టికెట్‌కి కోటి 50 లక్షల ధరమ్‌ల లాటరీ తగిలిందని తెలియగానే విలాస్‌ రిక్కల్‌కు రెక్కలొచ్చాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here