జాతీయభావాన్ని చాటాలి

0
1


జాతీయభావాన్ని చాటాలి

కార్యక్రమంలో పాల్గొన్న ఏబీవీపీ రాష్ట్ర సంఘటన మంత్రి నిరంజన్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచి దేశభక్తిని అలవరుచుకుని జాతీయభావాన్ని చాటాలని ఏబీవీపీ రాష్ట్ర సంఘటన మంత్రి నిరంజన్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌కే డిగ్రీ కళాశాలలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కశ్మీర్‌ విషయంలో ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా దేశ సమగ్రత పెంపొందుతోందన్నారు. విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో పోరాటాలు ఎనలేనివని , భవిష్యత్‌లో దేశం కోసం విద్యార్థులు పని చేసేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి భానుప్రసాద్‌, జిల్లా వ్యవస్థ ప్రముఖ్‌ స్వామి, జిల్లా ప్రముఖ్‌ గిరి, నాయకులు మనోజ్‌, కృష్ణ, నిఖిల్‌, లక్ష్మణ్‌, మహేందర్‌ తదితరులున్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/138654.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here