జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

0
4


జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

విజేత జట్టుకు జ్ఞాపిక అందిస్తున్న ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సభ్యుడు సంతోష్‌

ఫత్తేపూర్‌ (ఆర్మూర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: తమ క్రీడా నైపుణ్యంతో గ్రామీణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎంపీపీ నర్సయ్య పేర్కొన్నారు. ఆర్మూర్‌ మండలం ఫత్తేపూర్‌లో గురువారం రాత్రి గ్రామీణ అంతర పాఠశాలల క్రీడల ముగింపు, బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గెలుపొందిన జట్లకు నర్సయ్య, జడ్పీటీసీ సభ్యుడు సంతోష్‌, తెరాస నియోజకవర్గ బాధ్యుడు రాజేశ్వర్‌రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి కొత్తపల్లి లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు హన్మాండ్లు, ఎంఈవో రాజగంగారాం, క్రీడల కన్వీనర్‌ వెంకట్‌ నర్సయ్య, నిర్వహణ కార్యదర్శి మునిరాజ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజేతలు వీరే: వాలీబాల్‌ అండర్‌-14 బాలుర, బాలికల విభాగంలో మగ్గిడి ఉన్నత పాఠశాల గెలుపొందింది. వాలీబాల్‌ అండర్‌-17 బాలుర విభాగంలో మిర్ధాపల్లి ఉన్నత పాఠశాల, బాలికల విభాగంలో మగ్గిడి ఉన్నత పాఠశాల విజయం సాధించింది. ఖోఖో అండర్‌-14 బాలుర, బాలికల విభాగాల్లో ఫత్తేపూర్‌ ఉన్నత పాఠశాల గెలిచింది. ఖోఖో అండర్‌-17 బాలుర విభాగంలో పిప్రి ఉన్నత పాఠశాల, బాలికలో మగ్గిడి ఉన్నత పాఠశాల విజయం సాధించగా, కబడ్డీ అండర్‌-14 బాలికల విభాగంలో ఆలూర్‌ ఉన్నత పాఠశాల, అండర్‌-17 బాలుర విభాగంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌, ఆర్మూర్‌, బాలికల విభాగంలో మగ్గిడి ఉన్నత పాఠశాల విజయ సాధించాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here